Gold Rates Today: తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి ధర.. ఎంతంటే?
ABN, Publish Date - Aug 06 , 2024 | 07:12 AM
శ్రావణ మాసం శుభ కార్యాలకు నెలవు. ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తారు. అలాగే ఎక్కడ శుభకార్యం జరిగినా.. గుళ్లు గోపురాలకు వెళ్లినా.. ఒంటి నిండా బంగారు నగలు ధరించి వెళ్లతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మహిళలు.. మహారాణులు లాగా దర్శనమిస్తారు.
హైదరాబాద్, ఆగస్ట్ 06: శ్రావణ మాసం శుభ కార్యాలకు నెలవు. ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తారు. అలాగే ఎక్కడ శుభకార్యం జరిగినా.. గుళ్లు గోపురాలకు వెళ్లినా.. ఒంటి నిండా బంగారు నగలు ధరించి వెళ్లతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మహిళలు.. మహారాణులు లాగా దర్శనమిస్తారు. అలాంటి శావ్రణ మాసంలో ఆగస్ట్ 6వ తేదీ మంగళవారం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. అంటే తులం బంగారంపై కేవలం రూ. 10 మాత్రమే తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,690 ఉంది. ఇక మేలిమి బంగారం. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,570గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉంది. ఇక మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.70,570 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,570గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో ఇలా..
దేశ రాజధాని న్యూఢిల్లీ మహానగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.70,570 ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,840 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,720 ఉంది.
అలాగే చెన్నై మహానగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,470 ఉండగా, మెలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.70,590గా వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,570 వద్ద ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,690 ఉండగా, మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.70,570 వద్ద ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,570 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు తగ్గుతూ ఉంటే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. దేశంలో కిలో వెండి ధరపై రూ. 100 వరకు పెరిగింది. అయితే ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 85,800 ఉంది. ఇక దక్షిణాదిలో... తెలంగాణ రాజధాని హైదరాబాద్, కేరళ రాజధాని తిరువనంతపురం, తమిళనాడు రాజధాని చెన్నై మహానగరాల్లో వెండి ధర భారీగా.. అంటే రూ. 91 వేల వరకు ఉంది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కిలో వెండి ధర రూ. 85,800 వద్ద కొనసాగుతుంది.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 06 , 2024 | 07:14 AM