Tomato: భగ్గుమంటున్న టమాటా ధర.. కిలోకు రూ.130, ఎక్కడంటే..
ABN, Publish Date - Jul 07 , 2024 | 11:08 AM
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అనేక ప్రాంతాల్లో టమాటా(Tomato) ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ(delhi) నుంచి హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ సహా ఉత్తరాధి ప్రాంతాల్లోని అనేక చోట్ల కిలో టమాటా ధర కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.130 వరకు విక్రయిస్తున్నారు.
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అనేక ప్రాంతాల్లో టమాటా(Tomato) ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ(delhi) నుంచి హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ సహా ఉత్తరాధి ప్రాంతాల్లోని అనేక చోట్ల కిలో టమాటా ధర కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.130 వరకు విక్రయిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో ఈ రేట్లు ఉండటం పట్ల వినియోగదారులు టమాటాలు కొనుగోలు చేయాలంటేనే భయాపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీలో గత నెలలో రిటైల్ మార్కెట్లో కిలో టమాటా ధర(prices) రూ.28 నుంచి రూ.50 వరకు ఉండగా ప్రస్తుతం మాత్రం సెంచరీని దాటేసింది. ఈ రాష్ట్రాల్లో టమాటా ధర రూ.80 కంటే ఎక్కువగా ఉంది. వాటిలో అండమాన్, నికోబార్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. అండమాన్ నికోబార్‌లో టమాటా అత్యధికంగా కిలో రూ.115.67గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కిలో టమాటా ధర రూ.50 నుంచి 60 రూపాయల మధ్య ఉంది.
మరోవైపు ఉల్లి రేట్లు కూడా పెరిగాయి. గత నెలలో ఢిల్లీలో కిలో ఉల్లి రూ.32 ఉండగా, ఇప్పుడు రూ.53కి పెరిగింది. మిజోరం, అండమాన్ నికోబార్, నాగాలాండ్, సిక్కిం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ 60 రూపాయలకు చేరింది. అండమాన్ నికోబార్‌లో అత్యధికంగా కిలో ఉల్లి ధర రూ.60.67గా ఉంది. ఏడు రాష్ట్రాల్లో ఉల్లి అర్ధ శతాబ్దపు మార్కును దాటాయి.
అంతేకాదు బంగాళాదుంప కూడా కిలో రూ.40 కంటే ఎక్కువ ధరకు విక్రయించబడుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇవి కిలోకు రూ.58.33గా ఉన్నాయి. ఇక కేరళలో కిలో రూ.47.25, తమిళనాడులో రూ.45.65, పుదుచ్చేరిలో రూ.43, మిజోరంలో రూ.40.27గా ఉన్నాయి. కానీ హర్యానాలో కేజీ బంగాళదుంప అత్యల్ప ధర రూ.19.5కి లభిస్తుంది. అయితే ఆగస్టు మొదటి వారంలో అంటే శివరాత్రి నాటికి పచ్చి కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఇది కూడా చదవండి:
Gold and Silver Rate Today: రూ.4 వేలకుపైగా పెరిగిన వెండి.. గోల్డ్ ఎంత పెరిగిందంటే..
Dr. Reddy : న్యూట్రిషన్, ఓటీసీ వ్యాపారం బలోపేతంపై డాక్టర్ రెడ్డీస్ ఫోకస్
For Latest News and Business News click here
Updated Date - Jul 07 , 2024 | 11:24 AM