ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యూపీఐ లావాదేవీల్లో 33 శాతం వృద్ధి

ABN, Publish Date - Dec 26 , 2024 | 05:00 AM

ఈ ఏడాది సెమీ-అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లోని చిల్లర విక్రయ కేంద్రాల వద్ద యూపీఐ ద్వారా చెల్లింపులు వార్షిక ప్రాతిపదికన 33 శాతం వృద్ధి చెందాయని డిజిటల్‌ నెట్‌వర్క్‌ ప్లాట్‌ఫామ్‌ పేనియర్‌బై తాజా రిపోర్టు....

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెమీ-అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లోని చిల్లర విక్రయ కేంద్రాల వద్ద యూపీఐ ద్వారా చెల్లింపులు వార్షిక ప్రాతిపదికన 33 శాతం వృద్ధి చెందాయని డిజిటల్‌ నెట్‌వర్క్‌ ప్లాట్‌ఫామ్‌ పేనియర్‌బై తాజా రిపోర్టు వెల్లడించింది. దేశంలో డిజిటల్‌ చెల్లింపుల సాధనాల వినియోగం శరవేగంగా పెరుగుతోందనడానికిదే నిదర్శనమని నివేదికలో పేర్కొంది. అంతేకాదు, బీమా పాలసీల కొనుగోలు, ప్రీమియం చెల్లింపుల లావాదేవీల సంఖ్య 127 శాతం పెరిగిందని, కొత్త కస్టమర్లు 96 శాతం పెరిగారని తెలిపింది. గ్రామీణ, సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లోని 10 లక్షల రిటైల్‌ కేంద్రాల వద్ద ఈ ఏడాది జనవరి-నవంబరులో జరిగిన లావాదేవీల అధ్యయనం ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు పేనియర్‌బై వెల్లడించింది. వ్యాపార రుణాలు, బంగారం తాకట్టు రుణా లు వంటి రుణాలు ఈ ఏడాదిలో 297 శాతం పెరిగాయని తెలిపింది.

Updated Date - Dec 26 , 2024 | 05:14 AM