Loans: పర్సనల్ లోన్స్ కట్టకుంటే ఏమవుతుంది.. ఏం చర్యలు తీసుకుంటారు?
ABN, Publish Date - Mar 31 , 2024 | 01:29 PM
మధ్య తరగతి ఉద్యోగులకు(employees) అత్యవసరంగా డబ్బు అవసరం అవుతుంది. ఆ క్రమంలో మనీ కోసం తెలిసిన వారిని సంప్రదిస్తారు. ఆ సమయంలో వారి దగ్గరి నుంచి కూడా డబ్బు సాయం దొరకదు. దీంతో రుణం(loan) తీసుకోవాలని భావిస్తారు. కొంచెం వడ్డీ అటు ఇటుగా ఉన్నా కూడా ఆలోచించకుండా పర్సనల్ లోన్(personal loans) తీసుకుంటారు. అయితే తీసుకున్న రుణం కట్టకుంటే(not paid) ఎలా, ఆ సంస్థలు లేదా బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ఇప్పుడు చుద్దాం.
మధ్య తరగతి ఉద్యోగులకు(employees) అత్యవసరంగా డబ్బు అవసరం అవుతుంది. ఆ క్రమంలో మనీ కోసం తెలిసిన వారిని సంప్రదిస్తారు. ఆ సమయంలో వారి దగ్గరి నుంచి కూడా డబ్బు సాయం దొరకదు. దీంతో రుణం(loan) తీసుకోవాలని భావిస్తారు. కొంచెం వడ్డీ అటు ఇటుగా ఉన్నా కూడా ఆలోచించకుండా పర్సనల్ లోన్(personal loans) తీసుకుంటారు. అయితే తీసుకున్న రుణం, కాల వ్యవధిని బట్టి నెలకు కొంత మొత్తాన్ని ఈఎంఐ రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఇటివల కాలంలో ఎలాంటి పూచీకత్తు లేకుండా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కూడా వీటిని ఎక్కువగా ఇస్తున్నారు. అయితే తీసుకున్న రుణం కట్టకుంటే(not paid) ఎలా, ఆ సంస్థలు లేదా బ్యాంకులు తీసుకున్న వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ఇప్పుడు చుద్దాం.
వ్యక్తిగత రుణం చెల్లింపు నిబంధనలు, షరతులు ప్రతి బ్యాంక్, NBFCకి భిన్నంగా ఉంటాయి. మీరు సమయానికి మొదటి EMI చెల్లించకపోతే, బ్యాంక్ లేదా NBFC నిర్ణీత మొత్తాన్ని పెనాల్టీగా విధిస్తుంది. మీ లోన్ రీపేమెంట్ చెక్ బౌన్స్ అయితే బ్యాంక్ లేదా NBFC మీపై క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు, ఇది జైలుకు కూడా దారి తీయవచ్చు.
మీరు రుణం రెండు EMIలను చెల్లించకుంటే, బ్యాంకు ముందుగా మీకు రిమైండర్‌ను పంపుతుంది. ఆ తర్వాత మీరు మూడు వరుస వాయిదాల చెల్లింపును కోల్పోయినట్లయితే, రుణాన్ని తిరిగి చెల్లించమని బ్యాంక్ మీకు లీగల్ నోటీసును పంపుతుంది. హెచ్చరిక తర్వాత కూడా మీరు EMIని పూర్తి చేయకపోతే, మీరు బ్యాంకు ద్వారా డిఫాల్టర్‌గా ప్రకటించబడతారు.
ఒక వ్యక్తి ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లించడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే, అతను ఏకమొత్తం సెటిల్‌మెంట్ ఎంపికను పొందవచ్చు. అంటే వన్ టైమ్ సెటిల్‌మెంట్. ఇందులో మీరు బకాయి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని లోన్ కంపెనీ మీకు చెబుతుంది. దాని కంటే తక్కువ మొత్తం చెల్లించి లోన్‌ను క్లోజ్ చేసే అవకాశం మీకు ఉంటుంది.
మీరు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించకపోతే, అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా అన్ని బ్యాంకులు వ్యక్తికి రుణం ఇవ్వాలా వద్దా, ఏ వడ్డీ రేటుకు ఇవ్వాలో నిర్ణయిస్తాయి. రుణం తిరిగి చెల్లించకపోవడంతో మీ క్రెడిట్ స్కోర్ క్షీణిస్తే, భవిష్యత్తులో మీరు సులభంగా రుణం పొందలేరు.
మరోవైపు రికవరీ ప్రక్రియలో రుణ సంస్థలు ఎలాంటి తప్పు చేయకూడదని, నైతికతను కాపాడుకోవాలని ఆర్‌బీఐ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఏ రికవరీ ఏజెంట్ కూడా దుర్భాష, బెదిరింపులు లేదా హింసకు పాల్పడకూడదు. దీంతోపాటు రుణగ్రహీత సమాచారాన్ని చట్టబద్ధంగా అధీకృత సంస్థలతో కాకుండా ఇతరులతో పంచుకోవడానికి అనుమతించబడదు.
బ్యాంకులు, NBFCలు రుణగ్రహీతకు బకాయి ఉన్న మొత్తం, తిరిగి చెల్లించే తేదీ మొదలైన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తూనే ఉండాలి. కమ్యూనికేషన్ గౌరవప్రదంగా ఉండాలి. కానీ కస్టమర్‌కు అసౌకర్యంగా ఉండేలా అతిగా ఉండకూడదు.
రుణం చెల్లించనందుకు, బ్యాంక్ లేదా NBFC మీపై కేసు నమోదు చేయవచ్చు. మీరు ఏదైనా తాకట్టు పెట్టినట్లయితే, అది జప్తు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకు సిబ్బంది ఇబ్బంది పెడితే అంబుడ్స్ మన్‌కు వెళ్లి వారిపై ఫిర్యాదు చేయవచ్చు
లోన్ విలువ 20 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే వసూలు కోసం బ్యాంకు రికవరీ ట్రైబ్యునల్‌కు వెళుతుంది. అప్పుడు అప్పు తీసుకున్న వ్యక్తి, బ్యాంకు ఇరువురి వాదనలు విన్న తర్వాత కోర్టు తుదితీర్పు ఇస్తుంది. ఓ అధికారి ద్వారా ఆస్తులను జప్తు చేయాలని ఆదేశిస్తుంది. ఆ క్రమంలో కోర్టు బారోవర్ నుంచి అప్పుతోపాటు వడ్డీ, కోర్టు ఖర్చులు సహా అనేకం వసూలు చేస్తుంది. కానీ ఇందుకోసం ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Anand Mahindra: తయారీ రంగంలోని హీరోలకు సెల్యూట్.. మస్క్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా రిప్లై
Updated Date - Apr 01 , 2024 | 03:54 PM