ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Real vs Fake Charger: మీ ఫోన్ ఛార్జర్ నిజమైనదా, నకిలీదా.. ఇలా గుర్తించండి..

ABN, Publish Date - Dec 01 , 2024 | 01:47 PM

చాలా సార్లు దుకాణదారులు నిజమైన ఛార్జర్ల పేరుతో ప్రజలకు నకిలీ ఛార్జర్లను విక్రయిస్తుంటారు. అలాంటి నకిలీ ఛార్జర్‌లు మీ ఫోన్‌కు హాని కలిగిస్తాయి. కాబట్టి మీ ఛార్జర్ నిజమైనదా కాదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది ఎలా అనేది ఇక్కడ చెప్పుకుందాం.

Real vs Fake Chargers

ప్రస్తుత రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్ (smart phone) కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఛార్జర్‌లను (Phone Charger) అందించడం లేదు. దీంతో అనేక మంది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే సాధారణంగా బయటి నుంచి కొత్త ఛార్జర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అవి కొన్ని సార్లు సరిగా పనిచేయవు. అలాంటి వాటితో స్మార్ట్‌ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల దాని ఛార్జింగ్ క్రమంగా తగ్గుతుంది.

మంచి బ్యాటరీ లైఫ్ కోసం, ఒరిజినల్ ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడం ఎల్లప్పుడూ మంచిది. ఆ క్రమంలో తెలియకుండానే నకిలీ ఛార్జర్ కోసం చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. అందుకే ఛార్జర్ కొనే ముందు ఎలాంటి విషయాలను పాటించాలి. నకిలీ లేదా ఓరిజినల్ ఛార్జర్ విషయంలో ఎలా దానిని గుర్తించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.


నిజమైన లేదా నకిలీ ఛార్జర్‌ను గుర్తించడానికి ముందుగా మీరు ప్లే స్టోర్ నుంచి BIS కేర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి

  • IOS, Android రెండింటికీ BIS కేర్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది

  • ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

  • మీరు కొత్త వినియోగదారు అయితే యాప్‌లో మీ ప్రొఫైల్‌ని సృష్టించండి

  • మీరు హోమ్ స్క్రీన్‌లో సెర్చ్ దగ్గర BIS కేర్‌ని ఎంటర్ చేయండి

  • దీని తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది

  • అక్కడ క్రిందికి స్క్రోల్ చేసి R-Noని ధృవీకరించండి

  • ఆ తర్వాత కింద ఉన్న CRS ఆప్షన్‌పై క్లిక్ చేయండి

  • అక్కడ మీరు ఛార్జర్ R సంఖ్యను నమోదు చేయండి. ఇది అడాప్టర్‌పై వ్రాయబడి ఉంటుంది

  • దీని తర్వాత కొత్త స్క్రీన్ తెరవబడుతుంది. అక్కడ మీరు ఛార్జర్ అన్ని వివరాలను పొందుపరచండి

  • మీరు అడాప్టర్‌పై వ్రాసిన వివరాల నుంచి ఈ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు


ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి

సేవా కేంద్రం - ఎల్లప్పుడూ సంస్థ అధీకృత సేవా కేంద్రం నుంచి మాత్రమే ఛార్జర్‌ను కొనుగోలు చేయాలని గుర్తుంచుకోండి

బాక్స్ - ఒరిజినల్ ఛార్జర్ ప్యాకేజింగ్ సాధారణంగా మంచి నాణ్యతతో ఉంటుంది. కంపెనీ లోగో దానిపై స్పష్టంగా కనిపిస్తుంది

బార్‌కోడ్ - బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీరు ఛార్జర్ నిజమైనదా కాదా అని కూడా తనిఖీ చేసుకోవచ్చు

సమాచారం - బ్రాండెడ్ ఉత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం బాక్స్‌పై స్పష్టంగా కనిపిస్తుంది


లేదంటే ఇబ్బందులు

మీరు డూప్లికేట్ లేదా తక్కువ నాణ్యత గల ఛార్జర్‌ని ఉపయోగిస్తే ఫోన్ హీటింగ్ లేదా బ్లాస్టింగ్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఫేక్ ఛార్జర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇటీవల కొత్త ఛార్జర్‌ని కొనుగోలు చేసినట్లయితే అది ఒరిజినల్ ఛార్జర్ అవునా కాదా అని ఇలాంటి పద్ధతుల ద్వారా సులభంగా తెలుసుకున్న తర్వాత ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 01 , 2024 | 01:49 PM