ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Zomato: జొమాటోకి మరో షాక్.. రూ.184 కోట్లు కట్టాలని జీఎస్టీ నోటీస్

ABN, Publish Date - Apr 02 , 2024 | 08:10 PM

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు(Zomato) వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ నుంచి పలు ట్యాక్స్ డిమాండ్ నోటీసులు అందుకున్న జొమాటోకి తాజాగా ఢిల్లీలోని సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ నుంచి రూ.184.18 కోట్ల జీఎస్టీ నోటీసు జారీ అయింది.

ఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు(Zomato) వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ నుంచి పలు ట్యాక్స్ డిమాండ్ నోటీసులు అందుకున్న జొమాటోకి తాజాగా ఢిల్లీలోని సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ నుంచి రూ.184.18 కోట్ల జీఎస్టీ నోటీసు జారీ అయింది.

2014 నుంచి జూన్ 2017 వరకు కంపెనీకి చెందిన విదేశీ అనుబంధ సంస్థలు, కంపెనీ బ్రాంచ్ లు భారత్ బయట ఉన్న శాఖలు, దాని కస్టమర్లకు చేసిన నిర్దిష్ట విక్రయాలపై సర్వీస్ ట్యాక్స్ చెల్లించని కారణంగా ఈ నోటీస్ పంపినట్లు ఐటీ శాఖ తెలిపింది. దానికి ప్రతిస్పందనగా ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో సహా తగిన పత్రాలు, న్యాయపరమైన పూర్వాపరాలతో పాటు వివరణ ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అయితే తాము అందించిన ఆధారాలను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని జొమాటో చెబుతోంది.


ఏప్రిల్ 1న ఢిల్లీ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వు తమకు అందిందని కంపెనీ తెలిపింది. దీనిపై తాము న్యాయపరంగా పోరాడతామని జొమాటో స్పష్టం చేసింది.

అక్టోబరు 2014 నుండి జూన్ 2017 కాలానికి సంబంధించి ఈ ఆర్డర్‌ను అందుకున్నట్లు జొమాటో వెల్లడించింది. జరిమానాగా రూ. 92,09,90,306 సర్వీస్‌ ట్యాక్స్‌ కింద రూ92,09,90,306.. మొత్తం కలిపి రూ.184 కోట్లకు డిమాండ్‌ అందుకున్నట్లు జొమాటో పేర్కొంది. దీనిపై కోర్టులో అప్పీల్‌కు చేస్తామని కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 08:15 PM

Advertising
Advertising