Crime News: వామ్మో.. ఇలాంటి లవర్ కూడా ఉంటుందా..
ABN, Publish Date - Dec 03 , 2024 | 07:07 PM
ప్రేమికులు కొన్నిసార్లు ఉన్మాదంలో తప్పులు చేస్తూ చివరకు జైలు పాలవుతారు. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రియుడిని ఏకంగా సూట్‌కేస్‌లో బంధించి చిత్ర హింసలు పెట్టి చంపింది. చివరికి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.
Crime News: ప్రేమికుల మధ్య గొడవలు జరగడం మాములే. అయితే, ఆ కోపతాపాలు వెంటనే ఆవిరైపోతాయి. కానీ, కొన్నిసార్లు ఉన్మాదంలో ప్రేమికులు తప్పులు చేస్తూ చివరకు జైలు పాలవుతారు. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రియుడిని సూట్‌కేస్‌లో బంధించి చనిపోయే వరకు చిత్రహింసలకు గురిచేసిన మహిళ దోషిగా నిర్ధారణ కావడంతో జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.
అసలేం జరిగిందంటే..
అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో నివసించే సారా అనే 47 ఏళ్ల మహిళ జార్జి అనే 42 వ్యక్తితో సహజీవనం చేస్తోంది. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో 2020 సంవత్సరంలో ఒక రోజు రాత్రి ఇద్దరూ ఎప్పటిలాగే మద్యం సేవించి దాగుడు మూతలు ఆడుకున్నారు. అయితే, ఆటలో భాగంగా జార్జ్ ఒక సూట్ కేసులో దాక్కున్నాడు. ఇది గమనించిన సారా ప్రియుడు జార్జి లోపల ఉండగానే సూట్ కేసును జిప్ తో లాక్ చేసింది. దీంతో, తనకు ఊపిరి ఆడడం లేదని జార్జి గట్టిగా కేకలు వేశాడు. కానీ, సారా మాత్రం మద్యం మత్తులో నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లి బెడ్ రూమ్ లో నిద్రపోయింది. అయితే, వారిద్దరూ ఇంట్లో తరుచుగా వీడియోలు రికార్డ్ చేసేవారు. అలా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా రికార్డ్ అయింది. మరుసటి రోజు మద్యం మత్తు నుంచి తేరుకున్న సారా నిద్రలేచి చూసేసరికి జార్జి సూట్ కేసులో చనిపోయి ఉన్నాడు.
ఉద్దేశ్యపూర్వకంగానే..
జరిగిన ఘటనపై సారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జార్జి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత ప్రియురాలు సారా ఇదంతా ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులకు తెలిపింది. అయితే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో జార్జి శవంపై తీవ్రమైన గాయాలు కనిపించడంతో పోలీసులు ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. సారాని గట్టిగా ప్రశ్నించినా ఆమె నోరు మెదపలేదు. ఇదంతా ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందని పదే పదే చెబుతూ వచ్చింది. అయితే, పోలీసులు మాత్రం ఆమె ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా హత్య చేసిందని భావించారు.
చిత్రహింసలకు గురి చేసి..
దీంతో పోలీసులు ఆమె ఇంటిని తనిఖీలు చేశారు. అక్కడ పోలీస్ అధికారులకు వీడియో రికార్డింగ్స్ లభించాయి. అయితే, అందులో జార్జిని సారా చిత్రహింసలకు గురి చేసినట్లు తేలింది. జార్జి మరణించే సమయంలో కూడా తనకు ఊపిరి ఆడడం లేదని వెంటనే సూట్ కేసు తెరవాలని సారాను వేడుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. అయినా, సారా ఏ మాత్రం కనికరం లేకుండా చక్కగా నవ్వుతూ.. జరగాల్సిందే అని చెప్పి వెళ్లిపోయినట్లుగా వీడియోలో స్పష్టంగా ఉందని న్యాయమూర్తి గమనించారు. మిగతా వీడియోల్లో కూడా జార్జిని సారా పలుమార్లు హింసిస్తున్నట్లు ఉండడంతో న్యాయమూర్తి ఆమెను దోషిగా తేల్చి జీవితాతం జైల్లో ఉండేలా శిక్షి విధించారు.
Updated Date - Dec 03 , 2024 | 07:07 PM