ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anantapur: అనంతపురం జిల్లాలో భారీగా గోవా మద్యం పట్టివేత

ABN, Publish Date - Dec 10 , 2024 | 01:17 PM

జిల్లాలో భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని అనంతపురం ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి, విక్రయిస్తున్న అనంతపురానికి చెందిన నలుగురు నిందితులు అబుసలేహ, దస్తగిరి హుసేన్‌, కిశోర్‌, వాచ్‌మెన్‌ ఆనంద్‌లను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

- 474 బాక్సుల గోవా మ్యాన్సన్‌ హౌస్‌ స్వాధీనం

- మొత్తం విలువ రూ.44 లక్షలు

- నలుగురు నిందితుల అరెస్టు

- ప్రధాన నిందితుడు ‘బూసుపల్లి’ పరారీ

అనంతపురం: జిల్లాలో భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని అనంతపురం ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి, విక్రయిస్తున్న అనంతపురానికి చెందిన నలుగురు నిందితులు అబుసలేహ, దస్తగిరి హుసేన్‌, కిశోర్‌, వాచ్‌మెన్‌ ఆనంద్‌లను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అనంతపురానికి చెందిన బూసుపల్లి వెంకటశివకుమార్‌రెడ్డి పరారీలో ఉన్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: AP News: పవన్‍ కళ్యాణ్‍కు బెదిరింపు కాల్స్ కేసులో పురోగతి


రాప్తాడు మండలం రైల్వే గేటు సమీపంలోని ఓ తోటలోని రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన ఏపీ ధరల మేరకు రూ.44 లక్షల విలువైన 474 బాక్సుల గోవా మద్యాన్ని (మ్యాన్సన్‌ హౌస్‌ క్వార్టర్‌ బాటిళ్లు) అనంతపురం ఎక్సైజ్‌ పోలీసులు(Anantapur Excise Police) సోమవారం సాయంత్రం సీజ్‌ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటశివకుమార్‌రెడ్డి గతంలో పొలంలోని రేకుల షెడ్‌ను లీజుకు తీసుకొని గొర్రెల యూనిట్‌ను పెట్టినట్లు తెలిసింది. ఆ తర్వాత గొర్రెల యూనిట్‌ను పక్కన పెట్టి, అదే రేకుల షెడ్‌లో గోవా నుంచి తెచ్చిన అక్రమ మద్యాన్ని నిల్వ చేసి, మరో నలుగురి సహకారంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం.


సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా గుర్తించిన పోలీసులు..

బూసుపల్లి వెంకటశివకుమార్‌రెడ్డి, మరికొందరు గోవా నుంచి అక్రమంగా మద్యం బాటిళ్లు జిల్లాకు తీసుకొచ్చి, విక్రస్తున్నారని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మునిస్వామికి రెండు రోజుల క్రితం సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య ఆదేశాల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మునిస్వామి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ శ్రీరామ్‌, సీఐలు, ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుళ్లు బృందాలుగా విడిపోయి ప్రధాన నిందితుడు, ఇతర నిందితుల కోసం గాలించారు.


సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ప్రధాన నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో కారులో తిరిగినట్లు సమాచారం. ఇదే క్రమంలో తాను అక్రమంగా నిల్వ ఉంచిన రేకుల షెడ్‌ వద్దకు అతను వెళ్లినట్లు సమాచారం. సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా సోమవారం సాయంత్రం రేకుల షెడ్‌ వద్దకు వెళ్లిన ఎక్సైజ్‌ అధికారులకు అక్కడ మద్యం ఖాళీ అట్టపెట్టెలు ఉండటంతో రేకుల షెడ్‌లోకి వెళ్లి చూశారు. అక్కడ భారీగా గోవా మద్యం బాటిళ్లు ఉండటాన్ని గమనించారు. అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని సీజ్‌ చేశారు.


ప్రధాన నిందితుడు పరారీ..

గోవా అక్రమ మద్యం నిల్వ, విక్రయంలో ప్రధాన నిందితుడు అనంతపురానికి చెందిన బూసుపల్లి వెంకటశివకుమార్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. అతడితో కలిసి అక్రమ మద్యం నిల్వ, విక్రయించిన నలుగురు నిందితులను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన అబుసలేహ, దస్తగిరి హుసేన్‌, కిశోర్‌, వాచ్‌మన్‌ ఆనంద్‌ను ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ప్రధాన నిందితుడికోసం గాలింపును ముమ్మరం చేశారు. గోవా అక్రమ మద్యాన్ని చాకచక్యంగా పట్టుకున్న అధికారులు, సిబ్బందిని డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య అభినందించారు. ఈ దాడుల్లో అనంతపురం ఎక్సైజ్‌ సీఐ సత్యనారాయణ, ఎక్సైజ్‌ ఎస్‌ఐ జాకీర్‌ హుస్సేన్‌, అనంతపురం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐలు లక్ష్మీసుహాసిని, సునంద, అన్నపూర్ణ, అలిబేగ్‌, ఎస్‌ఐలు సత్యనారాయణ, హరికృష్ణ, హెచ్‌సీలు, కానిస్టేబుల్‌లు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం

ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్‌ ఇచ్చిన మాట తప్పరు

ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2024 | 01:17 PM