ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anantapur: ఇద్దరు పెళ్లాల ముద్దుల దొంగ.. ఏడుగురు పిల్లలతో పోషణ భారం

ABN, Publish Date - Dec 04 , 2024 | 12:51 PM

పోలీసులు ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 310 గ్రాముల బంగారు ఆభరణాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నాయకుడు షేక్‌ ఖాజా పీరాపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ(AP, Karnataka, Telangana)లో మొత్తం 41 కేసులు ఉన్నాయి.

- దిక్కుతోచక చోరీలకు దిగిన పెయింటర్‌

- ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 41 కేసులు

- మరో ఇద్దరితో కలిపి పట్టుకున్న పోలీసులు

- 31తులాల బంగారం.. కారు స్వాధీనం

అనంతపురం: జిల్లా పోలీసులు ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 310 గ్రాముల బంగారు ఆభరణాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నాయకుడు షేక్‌ ఖాజా పీరాపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ(AP, Karnataka, Telangana)లో మొత్తం 41 కేసులు ఉన్నాయి. అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జగదీష్‌ నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి, కేసుల వివరాలు వెల్లడించారు. వివిధ రాష్ట్రాలలో దొంగతనాలకు పాల్పడుతున్న దర్మవరం పట్టణానికి చెందిన షేక్‌ ఖాజాపీరా, మహేష్‌, జమీర్‌ను అరెస్టు చేశామని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Railwayzone: వైజాగ్ రైల్వే జోన్ పనులు మరింత వేగవంతం


జైలుకు వెళ్లొచ్చాక జతగాళ్లు

ముఠా నాయకుడు షేక్‌ ఖాజాపీరా వృత్తి రీత్యా పెయింటర్‌. ఇతనికి ఇద్దరు భార్యలు, ఏడుగురు పిల్లలు. పెయింటింగ్‌ ద్వారా వచ్చే డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలు ప్రారంభించాడు. 2021 నుంచి తాళం వేసిన ఇళ్లకు ఒక్కడే వెళ్లి చోరీలకు పాల్పడేవాడు. అనంతపురం జిల్లా సహా రాష్ట్రంలో 14, కర్ణాటకలోని బాగేపల్లిలో 4, కోలార్‌ జిల్లాలో 5, తెలంగాణలోని శంషాబాద్‌(Shamshabad)లో 4 దొంగతనాలు చేశాడు. అప్పట్లో నమోదైన ఈ 27 కేసులలో జైలుకు వెళ్లి.. ఈ ఏడాది మార్చిలో బయటకు వచ్చాడు.


ఆ తరువాత కూలి పనులకు వెళ్లే మహేష్‌, జమీర్‌ను కలుపుకుని దొంగతనాలను తిరిగి ప్రారంభించాడు. అనంతపురం రూరల్‌, త్రీటౌన్‌, ఫోర్త్‌టౌన్‌, యాడికి, ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 దొంగతనాలు, కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో 4 దొంగతనాలు చేశారు. వీరు కారును బాడుగకు తీసుకుని వెళ్లి చోరీలకు పాల్పడేవారు. జమీర్‌ డ్రైవింగ్‌ చేసేవాడు. తాళం వేసిన ఇళ్లను ఎంపిక చేసుకున్న తరువాత.. మహేష్‌, జమీర్‌ బయటే ఉండి ఎవరూ రాకుండా నిఘా ఉంచుతారు. ఖాజా ఒక్కడే ఇంట్లోకి వెళ్లి విలువైన ఆభరణాలను ఎత్తుకొచ్చేవాడు. వీరిపై అనంతపురం సీసీఎస్‌ పోలీసులు, రూరల్‌ పోలీసులు నిఘావేసి అరెస్టు చేశారు.


మరో చోరీ కోసం వచ్చి..

అనంతపురం నగర శివారులో మరో చోరీ కోసం ముఠా ప్రయత్నిస్తూ పోలీసుల కంట పడింది. కళ్యాణదుర్గం రోడ్డులోని రజాక్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో ఓ కారు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు వాహనంతో పాటు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వ్యవహారం బయటపడింది. సీసీఎస్‌ సీఐ ఇస్మాయిల్‌, రూరల్‌ సీఐ శేఖర్‌, ఎస్‌ఐ రాంబాబు వారిని అరెస్టు చేశారు. వారితోపాటు హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, మల్లికార్జున, చంద్రశేఖర్‌, గిరిబాబు, జయకర్‌, కానిస్టేబుళ్లు శివయ్య, పాండవ, ఆంజనేయప్రసాద్‌, రంజిత్‌, బాలకృష్ణ, షామీర్‌, రాజశేఖర్‌ను ఎస్పీ అభినందించారు.


కొత్త సెక్షన్‌ కింద..

నిందితులపై బీఎన్‌ఎ్‌స చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్పీ జగదీష్‌ తెలిపారు. ఆర్గనైజ్డ్‌ క్రైం కింద యావజ్జీవ కారాగార శిక్ష పడే సెక్షన్‌ కింద వీరిని రిమాండ్‌కు పంపుతామని తెలిపారు. దొంగతనం కేసుల్లో ఇదివరకు ఐదేళ్లు, ఏడేళ్ల జైలు శిక్ష పడేదని, ఇప్పుడు శిక్ష మరింత కఠినతరమైందని తెలిపారు. ఊళ్లకు వెళ్లే సమయంలో లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించుకోవాలని ప్రజలకు ఎస్పీ సూచించారు. పోలీసులకు సమాచారం ఇస్తే.. ఆ ఇంట్లో కెమెరా ఇన్‌సర్ట్‌ చేస్తారని, ఇంట్లోకి దొంగలు వస్తే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చని తెలిపారు. అల్మరా, బీరువాలకు తాళం వేయకుండా ని ర్లక్ష్యం వహిస్తుంటారని, అలా చేయొద్దని సూచించారు. బంగారు ఆభరణాలను లాకర ్లలో పెట్టాలన్నారు.


ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 04 , 2024 | 12:55 PM