ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: 63కి పెరిగిన కల్తీసారా మృతుల సంఖ్య

ABN, Publish Date - Jun 27 , 2024 | 12:24 PM

కళ్ళకుర్చి కరుణాపురం(Karunapuram) ప్రాంతంలో మెథనాల్‌ కలిపిన కల్తీసారా తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బుధవారం మృతిచెందారు. దీనితో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 61 నుండి 63కు పెరిగింది.

చెన్నై: కళ్ళకుర్చి కరుణాపురం(Karunapuram) ప్రాంతంలో మెథనాల్‌ కలిపిన కల్తీసారా తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బుధవారం మృతిచెందారు. దీనితో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 61 నుండి 63కు పెరిగింది. ఈ నెల 18, 19 తేదీలలో కరుణాపురంలో కల్తీసారా తాగి మొత్తం 225 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం కళ్లకుర్చి, సేలం, విల్లుపురం(Kallakurchi, Salem, Villupuram) ప్రభుత్వ ఆసుపత్రులు, పుదుచ్చేరి జిప్‌మర్‌ ఆసుపత్రి, కళ్ళకుర్చి ప్రైవేటు ఆసుపత్రులలో తరలించారు.

ఇదికూడా చదవండి: Chennai: మాజీ మంత్రి విజయభాస్కర్‌ పరార్‌.. విషయం ఏంటంటే..


వీరిలో చికిత్స ఫలించక కళ్లకుర్చి ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో 32 మంది, పుదుచ్చేరి జిప్‌మర్‌ ఆసుపత్రిలో ఐదుగుదురు,సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మంది, విల్లుపురం ఆసుపత్రిలో నలుగురు చొప్పున మొత్తం 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారిలో 74 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 88 మంది చికిత్సలందుకుంటున్నారని తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 27 , 2024 | 02:10 PM

Advertising
Advertising