Chennai: వన్‌సైడ్ లవ్ కాదు.. ఇద్దరం ప్రేమించుకున్నాం
ABN, Publish Date - Nov 22 , 2024 | 10:27 AM
టీచర్ రమణి హత్యకు కారణమైన మదనకుమార్ విచారణలో పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించాడు. తామిద్దరం సుదీర్ఘకాలంగా ప్రేమించుకుంటున్నామని వివరించాడు. ఆ మేరకు పోలీసులకు రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చాడు.
- టీచర్ హత్య కేసు నిందితుడు మదన్‌కుమార్ వాంగ్మూలం
చెన్నై: తంజావూరు(Thanjavur)లో టీచర్ రమణి హత్యకు కారణమైన మదనకుమార్ విచారణలో పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించాడు. తామిద్దరం సుదీర్ఘకాలంగా ప్రేమించుకుంటున్నామని వివరించాడు. ఆ మేరకు పోలీసులకు రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చాడు. తంజావూరు జిల్లా మల్లిపట్టినం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠాలు చెబుతున్న రమణిని తరగతి గదిలోనే దారుణంగా హతమార్చిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్రకలకలం సృష్టించిన విష యం తెలిసిందే.
ఈ వార్తను కూడా చదవండి: Rains: తుఫానుగా మారనున్న వాయుగుండం.. డెల్టా ప్రాంతంలో భారీ వర్షం
ఈ హత్యకు పాల్పడిన మదన్‌కుమార్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో... రమణి, తాను ఒకే వీథిలో నివసిస్తూ చిన్నప్పటి నుంచి స్నేహితులమని, పదో తరగతి వరకు కలిసి చదువుకున్నామని, ఆ స్నేహం కాస్త ప్రేమగామారిందని, ఆమె కోసమే తాను సింగపూర్ వెళ్ళి నెలకు లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం చేశానని తెలిపాడు. ఆమె కోసం సింగపూర్ ఉద్యోగం వదిలి స్వస్థలానికి వచ్చి కులవృత్తి చేపట్టినట్టు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తనకు పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించడంతో రమణి, తాను ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న విషయాన్ని తెలిపానని మదన్‌కుమార్ వివరించాడు.
తమ ప్రేమను అంగీకరించిన తల్లిదండ్రులు రమణి ఇంటికి వెళ్లగా.. జాతకం సరిగా లేదంటూ కుంటిసాకులు చెప్పడంతో పాటు కులపరంగా దూషించారన్నాడు. ఆ తర్వాత రమణిని పలుమార్లు కలిసి తమ పెళ్ళికి ఆమె తల్లిదండ్రుల అంగీకారం పొందాలని అడగ్గా.. ఆమె కూడా అంగీకరించిందని, కానీ చివరకు తనను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించడం వల్లే తనకు కోపం వచ్చిందన్నాడు. తన జీవితం మొత్తం ఆమె చుట్టూనే తిరిగిందని, ఆఖరికి తనను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఆ పనికి ఒడిగట్టానని వివరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోలీసులకు అందించాడు. ఈ మేరకు పోలీసులు మదన్‌కుమార్ వాంగ్మూలాన్ని రాతపూర్వకంగా నమోదు చేసుకున్నారు.
టీచర్ల ఆందోళన..
తమిళ టీచర్ రమణి హత్యా సంఘటనను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఉన్నత పాఠశాలల పట్టభద్రులైన ఉపాధ్యాయుల సంఘం తదితర సంఘాలకు చెందిన ఉపాధ్యాయులంతా విధులను బహిష్కరించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. హత్యకు గురైన రమణి కుటుంబీకులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల సాయంతో సరిపెట్టుకోకుండా మరో ఐదు లక్షలు సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆందోళనలో పాల్గొన్న ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఇదే విధంగా రాష్ట్ర ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఐదుగంటలకు జిల్లా విద్యాశాఖాధికారుల కార్యాలయాల వద్ద ధర్నా జరిపారు.
ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య
ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..
ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 22 , 2024 | 10:34 AM