ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: ఎయిర్‌పోర్టులో నక్షత్ర తాబేళ్ల స్వాధీనం..

ABN, Publish Date - Oct 02 , 2024 | 01:50 PM

మలేసియా దేశం నుంచి విమానంలో నగరానికి అక్రమంగా తరలించిన సుమారు 5 వేలకు పైగా నక్షత్ర తాబేళ్లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌(Kuala Lumpur) నుంచి మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఆదివారం అర్ధరాత్రి త్రిశూలంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది.

- ఇద్దరి అరెస్ట్‌

చెన్నై: మలేసియా దేశం నుంచి విమానంలో నగరానికి అక్రమంగా తరలించిన సుమారు 5 వేలకు పైగా నక్షత్ర తాబేళ్లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌(Kuala Lumpur) నుంచి మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఆదివారం అర్ధరాత్రి త్రిశూలంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికుల లగేజీని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Deputy CM: క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం..


పెద్ద ప్లాస్టిక్‌ బుట్టతో వచ్చిన నగరానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. ఆ బుట్టలో చాక్లెట్లు, బిస్కెట్లు, పిల్లలు ఆడుకొనే బొమ్మల కింద దాచిన సుమారు 5,000లకు పైగా ఎరుపు రంగు చెవులు కలిగిన నక్షత్ర తాబేళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ రకం తాబేళ్లను విదేశాల నుంచి రాష్ట్రానికి తరలించడం చట్టవిరుద్ధం కావడంతో ఆ తాబేళ్లను మంగళవారం ఉదయం నగరం నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానం ద్వారా తిరిగి పంపించారు.


...........................................................

ఈ వార్తను కూడా చదవండి:

.............................................................

Trains: తిరుపతి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు..

చెన్నై: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి(Tirupati) వెళ్లే భక్తుల సౌకర్యార్ధం అదనపు బోగీలు అనుసంధానం చేయనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.16057/16058 చెన్నై సెంట్రల్‌-తిరుపతి- చెన్నై సెంట్రల్‌ (సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌), నెం.16053/16054 డా.ఎంజీఆర్‌ సెంట్రల్‌-తిరుపతి-డా.ఎంజీఆర్‌ సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఈ నెల 2 నుంచి 15వ తేది వరకు, నెం.22616/22615 కోయంబత్తూర్‌-తిరుపతి-కోయంబత్తూర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు ఈ నెల 3 నుంచి 15వ తేది వరకు, నెం.22617/22618 తిరుపతి- బెంగళూరు-తిరుపతి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఈ నెల 4 నుంచి 15వ తేది వరకు అదనంగా ఒక జనరల్‌, ఒక ఛైర్‌ కార్‌ బోగీలు అనుసంధానం చేయనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.


ఇదికూడా చదవండి: హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..

ఇదికూడా చదవండి: రేవంత్‌ సర్కారు.. ఇక ఇంటికే

ఇదికూడా చదవండి: దసరాకు ఏపీఎస్‌ ఆర్టీసీ 1,200 ప్రత్యేక బస్సులు

ఇదికూడా చదవండి: చీపుర్లు, రోకళ్లతో సిద్ధంగా ఉండండి

Updated Date - Oct 02 , 2024 | 01:50 PM