ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: పేలుతున్న తూటా.. రౌడీల గుండెల్లో గుబులు

ABN, Publish Date - Sep 27 , 2024 | 01:39 PM

వరుస ఎన్ కౌంటర్లతో పోలీసులు అసాంఘిక శక్తుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తునంనారు. తమకెదురే లేదని విర్రవీగుతూ.. పలు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు తుపాకీ ఎఖ్కపెట్టారు. దీంతో రౌడీల గుండెల్లో గుబులు మొదలైంది.

- 26 ఏళ్లలో 125 ఎన్‌కౌంటర్లు

చెన్నై: ‘ఎన్‌కౌంటర్‌’.. ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీల గుండెల్లో గుబులు రేపుతున్న పదమిది.. కరడుగట్టిన రౌడీల గుండెలను చీల్చుతున్న తూటా శబ్దమది.. తప్పొప్పులు, నిజానిజాల సంగతెలాగున్నా ఇటీవలి కాలంలో రాష్ట్రంలో నిత్యం వినిపిస్తున్న ఈ పదం తీవ్ర దుమారం రేపుతోంది. హఠాత్తుగా రౌడీలు ఇప్పుడే పోలీసులపై ఎందుకు తిరగబడుతున్నారని కొందరు అడుగుతుండగా.. ఖాకీలు మాత్రం ఎందుకు హఠాత్తుగా ఎన్‌కౌంటర్లు జరుపుతున్నారని మరికొందరు నిలదీస్తున్నారు. ఈవాదోపవాదాల సంగతెలాగున్నా.. ఖాకీల తూటా లకు బలవుతున్న రౌడీల సంఖ్యమాత్రం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగడం చర్చనీయాంశమైంది.

ఇదికూడా చదవండి: గుండెల్లో గుడి కట్టుకున్న అభిమానం..


1970 నుంచే...

రాష్ట్రంలో 1970 - 80 మధ్య కాలంలో ఎన్‌కౌంటర్‌(Encounter) ఘటనలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అదికూడా నక్సలైట్లకు వ్యతిరేకంగా జరిగిన ఘటన. 1979, సెప్టెంబరు 17తేదీ హొగెనేకల్‌(Hogenekal)లో అప్పు, 1980 సెప్టెంబరు 17న బాలన్‌ అనే వ్యక్తి ఎన్‌కౌంటర్‌కు బలయ్యారు. అనంతరం పోలీసుల తుపాకీ దృష్టి రౌడీల వైపు మళ్లింది. 1984లో తిరునల్వేలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో శివలప్పేరి పాండి హతమయ్యాడు. రాష్ట్రంలో నేరచరితులు ఎన్‌కౌంటర్‌కు బలైన తొలి ఘటన ఇదే. అనంతరం పలు సందర్భాల్లో రౌడీషీటర్లుగా చెలామణి అవుతున్న వారిపై పోలీసుల తుపాకీ తూటా పేలింది.


సంచలనం రేపిన ఎన్‌కౌంటర్లు...

ఈ నేపథ్యంలో 1996 జూలై 10న నుంగంబాక్కం లయోలా కళాశాల సమీపంలో ప్రముఖ రౌడీ ఆశైతంబి, అతని అనుచరులు గుణ, మనో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలు ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం అప్పట్లో సంచలనం రేపింది. అదే ఏడాది అడయార్‌లో కపిలన్‌ అనే రౌడీ కూడా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అనంతరం 2003లో అయోధ్యకుప్పంలో వీరమణిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌. తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన ఎర్రచందనం స్మగ్లర్‌ వీరప్పన్‌, అతని అనుచరులు సేత్తుకుళి గోవిందన్‌, చంద్రగౌడ, సేతుమణిని 2004 అక్టోబరు 18న కె.విజయకుమార్‌ నేతృత్వంలోని తమిళనాడు టాస్క్‌పోర్స్‌ ధర్మపురి జిల్లా పాప్పారపట్టి సమీపంలో ఎన్‌కౌంటర్‌ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మరో ఘటన కోయంబత్తూర్‌లో 2010 నవంబర్‌ 10న చోటుచేసుకుంది. పాఠశాలకు వెళుతున్న బాలికను, ఆమె తమ్ముడిని వ్యాన్‌లో కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటనలో డ్రైవర్‌ మోహన్‌ పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌కు నేలవాలాడు.


ఇటీవల జరిగిన ఘటనలు...

నగరంలో బీఎస్పీ అధ్యక్షుడు ఆమ్‌స్ట్రాంగ్‌ ఆయన ఇంటి సమీపంలో దారుణ హత్యకు గురైన ఘటనలో పొన్నై బాలు, ప్రముఖ రౌడీ తిరువేంగడం సహా పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అరుణ్‌ రౌడీలపై ఉక్కుపాదం మోపారు. రౌడీలకు వారి పంథాలోనే సమాధానం చెబుతామని బాధ్యతలు చేపట్టిన రోజే కమిషనర్‌ హెచ్చరించారు. అనంతరం నగరవ్యాప్తంగా రౌడీల ఆగడాలు అడ్డుకొనేలా పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. అలాగే, ఏడీఎస్పీ డేవిడ్‌సన్‌ దేవాశ్వీరాదం సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా రౌడీలను కట్టడి చేసే చర్యలు ప్రారంభమయ్యాయి. అజ్ఞాతంలోకి వెళ్లిన రౌడీల ఆచూకీ గుర్తించేందకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.


అలా తనిఖీలు చేపట్టిన సమయంలో, పుదుకోట అటవీ ప్రాంతంలో తలదాచుకున్న ప్రముఖ రౌడీ దురై, పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకోబోయాడు. ఆ సమయంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో దురై మృతిచెందాడు. అదేవిధంగా కొద్దిరోజుల క్రితం రౌడీ కాకా బాలాజీ ఎన్‌కౌంటర్‌, మూడు రోజుల క్రితం మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. స్థానిక వేళచ్చేరిలో బార్‌ యజమానిని బెదిరించిన కేసులో గాలిస్తున్న రౌడీ రాజా అలియాస్‌ సీజింగ్‌ రాజా రాష్ట్ర పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. నగరంలో మూడు నెలల్లో మూడు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు పేరుమోసిన రౌడీలు మృతిచెందారు. దీంతో నగరంతో పాటు రాష్ట్రంలో వున్న చాలామంది రౌడీలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయి తల దాచుకుంటున్నారు.


26 ఏళ్లలో 125 మంది ఎన్‌కౌంటర్‌ ...

రాష్ట్రంలో 1998 నుంచి డీఎంకే ప్రభుత్వ హయాంలో 69 ఎన్‌కౌంటర్లు, అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో 56 ఎన్‌కౌంటర్లు జరిగాయి. 1998 నుంచి 2001 వరకు డీఎంకే ప్రభుత్వంలో 22 ఎన్‌కౌంటర్లు, 2001 నుంచి 2006 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంలో 29 ఎన్‌కౌంటర్లు, 2006 నుంచి 2011 వరకు డీఎంకే ప్రభుత్వంలో 31 ఎన్‌కౌంటర్లు, 2011 నుంచి 2021 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంలో 27 ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం హయాంలో 2021 మే నుంచి ఇప్పటివరకు 16 ఎన్‌కౌంటర్లు జరిగాయి. నేరాలతో సంబంధాలున్న ఎన్‌కౌంటర్లు మినహా, అన్నాడీఎంకే ప్రభుత్వంలో 2011లో పరమకుడి తుపాకీ కాల్పుల్లో ఏడుగురు, 2018 తూత్తుకుడిలో జరిగిన తుపాకి కాల్పుల్లో 13 మంది మృత్యువాతపడ్డారు.


కాగా ఈ ఎన్‌కౌంటర్లతో రౌడీల పీడ విరగడవుతోందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, ఏ రూపంలోనైనా సరే ఎవరినైనా హతమార్చే హక్కు ఎవ్వరికీ లేదని మానవహక్కుల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. పోలీసులు ఎప్పటిలానే తమ విఽధి నిర్వహణలో ప్రాణాలకు ముప్పు కలగడం వల్లనే ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అయితే సదరు రౌడీల చేతుల్లో బలైన కుటుంబాలు రోడ్డున పడుతుండగా, పోలీసుల చేతుల్లో హతమైన రౌడీల కుటుంబాలు అనధికారిక సమాజ బహిష్కరణ ఎదుర్కొంటున్నాయి. తప్పెవరిది? ఫలితం అనుభవిస్తున్నదెవరు?.


జారి పడుతున్నారు బాస్‌!

ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినవారు, యువతులను వేదించిన వారు, అఘాయిత్యాలకు పాల్పడిన వారు అరెస్టయిన మరునాడే పోలీస్‌ స్టేషన్లలో కాలు జారి పడినట్లు మీడియాలో ఫొటోలు కనిపిస్తున్నాయి. మరి వారు ఎందుకు పడుతున్నారో, ఎలా పడుతున్నారో బయటకు రావడం లేదు గానీ.. అరెస్టయిన మరునాడే ఆ నేరగాళ్లు కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుని ఆస్పత్రుల పాలవుతున్నారు. రౌడీలూ గ్రహిస్తున్నారా?.. మీరూ ‘జారి పడకుండా’ ఉండాలంటే .. ‘ఒళ్లు దగ్గరపెట్టుకుని’ నడచుకోవాలి మరి!


ఇదికూడా చదవండి: Harish Rao: పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులివ్వండి

ఇదికూడా చదవండి: కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోకండి

ఇదికూడా చదవండి: KCR: కొండా లక్ష్మణ్‌ బాపూజీ కృషి అజరామరం

ఇదికూడా చదవండి: అబ్బో.. వీళ్ల పైత్యం మామూలుగా లేదుగా.. మెట్రోరైల్వేస్టేషన్‌లో అశ్లీల రీల్స్‌..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 27 , 2024 | 01:39 PM