ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chicken rice: చికెన్‌రైస్‏లో విషం కలిపి.. తాతను హతమార్చిన మనవడు

ABN, Publish Date - May 04 , 2024 | 01:13 PM

తన ప్రేమను వ్యతిరేకించాడనే కోపంతో విషం కలిపిన చికెన్‌ రైస్‌(Chicken rice) ఇచ్చి తాతను హతమార్చిన మనవడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

- నామక్కల్‌ జిల్లాలో ఘోరం

చెన్నై: తన ప్రేమను వ్యతిరేకించాడనే కోపంతో విషం కలిపిన చికెన్‌ రైస్‌(Chicken rice) ఇచ్చి తాతను హతమార్చిన మనవడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నామక్కల్‌ సమీపం దేవరాయపురం ప్రాంతంలో భగవతి (20), అతడి తల్లి నదియా (40), తాత షణ్ముగం (67) నివసిస్తున్నారు. భగవతి ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ(Engineering College)లో చదువుతున్నాడు. గత ఏప్రిల్‌ 30న నామక్కల్‌ బస్‌స్టేషన్‌ సమీపంలోని హోటల్‌కు వెళ్ళిన భగవతి చికెన్‌ బిర్యాని(Chicken biryani) తిని తల్లి, తాత కోసం రెండు చికెన్‌ రైస్‌ పొట్లాలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. దానిని తిన్నవెంటనే నదియా, షణ్ముగం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో దిగ్ర్భాంతి చెందిన కుటుంబీకులు వారిని చికిత్స నిమిత్తం నామక్కల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా, వారి నోటిలో నురుగలు కనిపించాయి. చికెన్‌ రైస్‌ తినటం వల్ల వారికి వికటించలేదని, విషం కలిపిన రైస్‌ తినటం వల్లే అస్వస్థతకు గురైనట్లు నిర్ధారించారు.

ఇదికూడా చదవండి: Rahul Gandhi: రాయ్‌బరేలీలో రాహుల్ పోటీ.. వాయనాడ్ ప్రజల స్పందన ఇదే

ఈ సంఘటన గురించి తెలుసుకున్న కలెక్టర్‌ ఉమా, ఆహార భద్రతావిభాగం అధికారులు భగవతి చికెన్‌ రైస్‌ కొనుగోలు చేసిన హోటల్‌కు వెళ్ళి ఆహారపదార్థాల శాంపిల్స్‌ సేకరించి హోటల్‌కు సీలు వేయించారు. ఈ సంఘటనపై విచారణకు పోలీసులకు ఆదేశించారు. పోలీసులు రంగంలోకి దిగి భగవతిని, హోటల్‌ యజమాని జీవానందాన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షణ్ముగం గురువారం రాత్రి మృతి చెందాడు. షణ్ముగం తిన్న చికెన్‌ రైస్‌ శాంపిల్స్‌ పరీక్షించి సేలం ప్రయోగశాల అధికారులు ఆ రైస్‌లో క్రిమిసంహారక మందు కలిపినట్లు ధ్రువీకరించారు. దీంతో పోలీసులకు భగవతిపై అనుమానం కలిగింది. వెంటనే అతడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి విచారించగా చికెన్‌ రైస్‌లో క్రిమి సంహారక మందు కలిపింది అతడేనని తేలింది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతోనే తల్లిని, తాతను హత్య చేయాలని చికెన్‌ రైస్‌లో విషం కలిపినట్లు భగవతి వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక ఆస్పత్రిలో ఉన్న నదియాకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Chennai: ల్యాండింగ్‌ సమయాల్లో విమానాలపై లేజర్‌ కాంతులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 04 , 2024 | 01:13 PM

Advertising
Advertising