ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Encounter: పోలీసులు వర్సెస్ గ్యాంగ్ స్టర్.. ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలు.. కేసు ఏంటంటే..

ABN, Publish Date - Jan 04 , 2024 | 09:12 AM

హిందూ సాంప్రదాయంలో ఆవులకు విశేష ప్రాధాన్యత ఉంది. గోమాతను దైవంతో సమానంగా పూజిస్తుంటారు. అలాంటి మూగజీవులను అక్రమంగా తరలిస్తున్న కేసులో భాగంగా ఓ నిందితుడి కోసం గాలింపు చేపట్టగా పోలీసులకు, అతనికి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి

హిందూ సాంప్రదాయంలో ఆవులకు విశేష ప్రాధాన్యత ఉంది. గోమాతను దైవంతో సమానంగా పూజిస్తుంటారు. అలాంటి మూగజీవులను అక్రమంగా తరలిస్తున్న కేసులో భాగంగా ఓ నిందితుడి కోసం గాలింపు చేపట్టగా పోలీసులకు, అతనికి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఉత్రరప్రదేశ్ లోని బదాయు జిల్లాకు చెందిన బిట్టన్ అలీ అలియాస్ సుహైల్ ఆవుల అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో ఇక లాభం లేదని భావించిన పోలీసులు.. అతనిని పట్టుకుని తీసుకువచ్చినా లేదా అతని ఆచూకీ చెప్పిన వారికీ రూ.25,000 ఇస్తామని రివార్డు ప్రకటించారు.

ఇదే సమయంలో సుహైల్ ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రిని చుట్టుముట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకే వచ్చారని భావించిన సుహైల్ వారిపై కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రతీకార కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్ లో సుహైల్ కాలికి బుల్లెట్ తగిలింది. సీతాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ చక్రేష్ మిశ్రా మాట్లాడుతూ, పిసావా ఠాణా పోలీసులు, ఎస్ఓజీ బృందం ఆవులను అక్రమ రవాణా కేసులో భాగంగా దర్యాప్తు నిర్వహిస్తున్న సమయంలో వారికి బిట్టన్ అలీ అలియాస్ సుహైల్ పట్టుబడ్డాడు.

వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అయిన సోహైల్ పై ₹ 25,000 రివార్డు ఉంది. కాల్పుల్లో గాయపడటంతో అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సీతాపూర్ ఎస్పీ చక్రేశ్ మిశ్రా తెలిపారు. నిందితుడి నుంచి నంబర్ ప్లేట్ లేని బైక్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Updated Date - Jan 04 , 2024 | 09:12 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising