Before Wedding: పెళ్లికి కొన్ని గంటల ముందే కుమారుడిని హత్య చేసిన తండ్రి
ABN, Publish Date - Mar 08 , 2024 | 09:52 AM
కుమారుడి పెళ్లి ఇంకొన్ని గంటల్లో జరగనుంది. అప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అంతలోనే ఘోర విషాదం చోటుచేసుకుంది. ఏకంగా పెళ్లి కావాల్సిన కుమారుడినే తండ్రి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో జరిగింది.
కుమారుడి పెళ్లి ఇంకొన్ని గంటల్లో జరగనుంది. అప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అంతలోనే ఘోర విషాదం చోటుచేసుకుంది. ఏకంగా పెళ్లి కావాల్సిన కుమారుడినే తండ్రి(father) హత్య(murder) పలువురితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో జరిగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. దక్షిణ ఢిల్లీలోని డియోలీ ఎక్స్‌టెన్షన్‌లోని రాజు పార్క్‌లో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ తండ్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి తన కుమారుడు(son) గౌరవ్ సింఘాల్ (29)పై కత్తెర సహా పలు ఆయుధాలతో దాడి చేసి హత్య చేశాడు.
ఆ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు జైపూర్‌కు చెందిన నిందితుడు తండ్రి రంగలాల్ (50)ని అరెస్టు చేశారు. రంగలాల్ వద్ద నుంచి రూ.15 లక్షల నగదు, రూ.50 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు(police) మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు తండ్రి, అతని ఇద్దరు సహచరులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.
అయితే గురువారం కుమారుడి పెళ్లి ఉండటం విశేషం. గ్రామంలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకే తండ్రి(father) దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కొడుకు గౌరవ్, అతని భార్య తనతో విడివిడిగా జీవించేవారని నిందితుడు రంగ్‌లాల్ చెప్పినట్లు సౌత్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. గౌరవ్ రాజు పార్క్ ప్రాంతంలోనే జిమ్ నడుపుతూ ఉండేవాడు. వీరి మధ్య గత ఆరేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని అన్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదని చెప్పారు.
ఆరేళ్ల క్రితం జరిగిన గొడవలో గౌరవ్ తన తండ్రిని గ్రామ ప్రజల ముందే చెప్పుతో కొట్టాడని వెల్లడించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అన్నారు. నిశ్చితార్థానికి ఒకరోజు ముందు కూడా మార్చి 2న తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగిందని చెప్పారు. మరోవైపు సింఘాల్ ఓ యువతిని ప్రేమించాడని(love) ఆ యువతి విషయంలోనే తండ్రి, కొడుకుల మధ్య గొడవలు వచ్చాయని ఇంకొంత మంది అంటున్నారు. ఏది ఏమైనా పెళ్లి(marriage) కావాల్సిన యువకుడు మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Congress: నేడే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..? గాంధీలు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్..?
Updated Date - Mar 08 , 2024 | 09:52 AM