ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Fire Accident: సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. సీఎం స్పందన, ఘటనా స్థలానికి 20 ఫైర్ ఇంజిన్లు

ABN, Publish Date - Mar 09 , 2024 | 12:45 PM

రాష్ట్ర సచివాలయం వల్లభ్‌భవన్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న దాదాపు 20 అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాద ఘటనపై సీఎం కూడా స్పందించారు.

మధ్యప్రదేశ్‌(madhya pradesh) భోపాల్‌(bhopal)లోని రాష్ట్ర సచివాలయం వల్లభ్‌భవన్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం(fire accident) సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న దాదాపు 20 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వల్లభ్ భవన్ (Vallabh Bhavan) మూడో అంతస్తులో ఈ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా వ్యాపించగా పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డీసీపీ శ్రద్ధా తివారీ అన్నారు.


ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్(Mohan yadav) స్పందించారు. వల్లభ్ భవన్ పాత భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగినట్లు తెలిసిందని వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో నిఘా పెట్టి, సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఆ తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.

అయితే మూడో అంతస్తులో పాత ఫైళ్లు, చెత్తకుప్పలు ఎక్కువగా ఉండడంతో మంటలు చెలరేగాయని(fire) పలువురు చెబుతున్నారు. కానీ అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. వల్లభ్ భవన్ రాష్ట్ర ప్రభుత్వ అతిపెద్ద కార్యాలయం కాగా ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రుల కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అనేక పత్రాలు కూడా వల్లభ్ భవన్‌(Vallabh Bhavan)లోనే ఉన్నాయి.

Updated Date - Mar 09 , 2024 | 12:47 PM

Advertising
Advertising