Jeep Parasailing: జీప్ పారాసైలింగ్ ప్రమాదంలో టూరిస్ట్ మృతి.. అతని భార్య ఫిర్యాదుతో ఇద్దరు అరెస్ట్
ABN, Publish Date - May 21 , 2024 | 12:46 PM
ఇటివల ఓ పర్యాటకుడికి జరిగిన ఘటనపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించిన కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటివల ఓ పర్యాటకుడికి జరిగిన ఘటనపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించిన కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్(Gujarat) కచ్ జిల్లాలోని మాండ్వి బీచ్(Mandvi Beach) వద్ద జీప్ పారాసైలింగ్(Jeep Parasailing) ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన 48 ఏళ్ల పర్యాటకుడు శుక్రవారం మరణించింది. ఆ క్రమంలోనే అతని భార్య పోలీసులకు(police) కంప్లైంట్ చేసింది.
జంషెడ్‌పూర్‌లో నివసిస్తున్న బల్‌దేవ్ సింగ్ తన కుటుంబం(family)తో కలిసి ఆ బీచ్‌ని సందర్శించడానికి వెళ్లాడు. అప్పుడు శివ్ వాటర్ స్పోర్ట్స్ అనే ప్రైవేట్ కంపెనీ అందించే జీప్ పారాసైలింగ్‌ను ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే బాధితుడు చాలా ఎత్తు పై నుంచి పడిపోయాడు. దీంతో వేగంగా వచ్చిన జీపు ద్వారా అతను చాలా దూరం ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో డ్రైవర్, సహాయకుడు ఘటనా స్థలం నుంచి పారిపోయారని పోలీసులు(police) తెలిపారు. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు మాండ్విలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత భుజ్‌లోని ఆసుపత్రికి రెఫర్ చేశారు. కానీ అతన్ని చూసిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు.
అయితే అతని భార్య వాటర్ స్పోర్ట్స్ ఏజెన్సీ ఎలాంటి భద్రతా సామాగ్రిని అందించలేదని, పారాసైలర్ తాడును జీపుకు కట్టి అతివేగంగా నడిపించడం వల్లే ప్రమాదం(Accident) జరిగిందని అతని భార్య ఆరోపించింది. ఆ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వాటర్ స్పోర్ట్స్ నిర్వహించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మరోవైపు ఇలాంటి టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వినూత్న రైడ్స్ చేసే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
ఇది కూడా చదవండి:
Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Read Latest Crime News and Telugu News
Updated Date - May 21 , 2024 | 12:49 PM