ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Model: హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..హోటల్లో ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Jan 07 , 2024 | 06:01 PM

హర్యానా(haryana) గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ స్నేహితురాలు, మోడల్ దివ్య పహుజా హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆమె ఓ వ్యాపారితో సంబంధం పెట్టుకున్న క్రమంలోనే ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

హర్యానా(haryana) గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ స్నేహితురాలు, మోడల్ దివ్య పహుజా(Divya Pahuja) హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. దివ్య హత్య జరిగిన 4 గంటల తర్వాత అంటే జనవరి 2న రాత్రి 9 గంటలకు హోటల్ సిటీ పాయింట్ వద్ద ఆమె హత్యకు గురైందని గురుగ్రామ్ పోలీసులకు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ హోటల్లోని 114వ నంబర్ రూంలో సోదాలు చేశారు. కానీ అక్కడ మృతదేహం కనిపించకపోవడంతో వెంటనే అక్కడి నుంచి తిరిగి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ దివ్య మృతదేహాన్ని వెతుక్కుంటూ అదే పోలీసులు మళ్లీ అదే హోటల్‌కు చేరుకోగా.. మృతదేహం అక్కడ కనిపించలేదు. కానీ ఆ మృతదేహాం 111వ నంబర్‌లో పడి ఉంది. దీంతో ఈ కేసు గురించి పోలీసులు మరింత సమాచారాన్ని ఆరా తీయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.


అయితే దివ్య పహుజా గురుగ్రామ్ హోటల్ వ్యాపారి అభిజీత్ సింగ్‌తో రిలేషన్లో ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు దివ్య అతడి నుంచి డబ్బులు వసూలు చేసేదని పోలీసులు గుర్తించారు. దివ్య వద్ద అభిజీత్ వ్యక్తిగత అభ్యంతరకరమైన వీడియోలు, చిత్రాలు అడ్డుపెట్టుకుని ఆమె పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు(police) పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఇటీవలి కాలంలో ఆమె అతన్ని బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయగా ఆందోళన చేందిన అభిజీత్ ఓ ప్లాన్ వేశాడని అధికారులు చెప్పారు. జనవరి 2న దివ్యను అతను హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆ క్రమంలో అతను ఆమెతో మాట్లాడి చిత్రాలను తొలగించాలని కోరాడు. కానీ దివ్య అందుకు అంగీకరించలేదు. దీంతో ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. ఆ నేపథ్యంలో కోపంతో ఊగిపోయిన అభిజీత్ ఆమెను తుపాకీతో కాల్చిచంపాడు.


అయితే హోటల్‌(hotel)లోని రూం నంబర్ 111లో ఇదంతా జరిగింది. కానీ ఈ ఘటన తర్వాత అభిజిత్ హోటల్ సిటీ పాయింట్‌ను లీజుకు నడుపుతున్న అనూప్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. కానీ హోటల్‌లోని రూం నంబర్ 114లో యువతి మృతదేహం ఉందని పోలీసులకు తప్పుగా సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు కూపీ లాగగా మొత్తం వ్యవహారం క్రమంగా బయటకు వచ్చింది.

Updated Date - Jan 07 , 2024 | 06:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising