Hyderabad: రాత్రివేళ.. రోడ్డుపైనే..
ABN, Publish Date - May 16 , 2024 | 12:25 PM
హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఆ రహదారిపై రాత్రి వేళ రాకపోకలు సాగించాలంటే ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలకు వణికిపోతున్నారు. చీకటి పండిందంటే చాలు.. మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
- ఖైతలాపూర్‌లో అసాంఘిక కార్యక్రమాలు
- మూడు రోజుల క్రితం ఖైతలాపూర్‌లోని గ్రీన్‌హిల్స్ రోడ్డులోని 15వ ఫేజ్ ప్రాంతానికి బేగంపేట నుంచి నలుగురు యువకులు వచ్చారు. వీరికి వ్యభిచార నిర్వాహకులకు మధ్య లావాదేవీల్లో తేడాలు రావడంతో గొడవ జరిగింది. ముగ్గురు యవకులు పారిపోగా... ఓ యువకుడు అక్కడే ఉండడంతో వ్యభిచార నిర్వాహకులు అతని దుస్తులు విప్పి రోడ్డుపై కూర్చోపెట్టారు.
- ఖైతలాపూర్, కేపీహెచ్‌బీకాలనీ 15వఫేజ్, లోధా అపార్ట్‌మెంట్స్ సమీపంలో వ్యభిచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందంగా తయారై రహదారుల పక్కన నిల్చుండడంతో అటువైపుగా వెళ్లే వాళ్లు అక్కడ ఆగి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. నగదు లావాదేవీల విషయంతో తరచూ గొడవలు చోటు చేసుకొంటున్నాయి.
హైదరాబాద్: హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఆ రహదారిపై రాత్రి వేళ రాకపోకలు సాగించాలంటే ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలకు వణికిపోతున్నారు. చీకటి పండిందంటే చాలు.. మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దీనికితోడు హౌసింగ్‌బోర్డు(Housing Board) విభాగానికి చెందిన నిర్మాణుష ప్రాంతం ఉండడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. దీంతో వ్యభిచారం సైతం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా మందుబాబులు మద్యం తాగుతూ రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతూ వాహనదారులతో గొడవలు పడి కొట్లాటలకు పాల్పడుతున్నారు. ఆ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతున్నట్లు ప్రచారం కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు అర్ధరాత్రిళ్లు బైక్‌లపై వచ్చి న్యూసెన్స్ సృష్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అదే ఖైతలాపూర్ సిగ్నల్ నుంచి హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ వరకు ఉన్న గ్రీన్‌హిల్స్ రహదారి.
మూసాపేట చౌరస్తా నుంచి హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ వరకు సులభంగా రాకపోకలు సాగించేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో గ్రీన్‌హిల్స్ పేరుతో రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మార్గంలో వేలాదిమంది ఐటీ ఉద్యోగులు, నైట్ డ్యూటీ ఉద్యోగులు, వ్యాపారులు రాత్రింబవళ్లు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ రహదారికి ఆనుకొని హౌసింగ్‌బోర్డుకు చెందిన వందలాది ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇదే అదునుగా భావించిన కొందరు అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొందరు రోడ్డు పక్కన నిల్చుకొని యువకులను ఆకట్టుకొనేలా వ్యవహరిస్తున్నారు. విటులతో మాట్లాడుకొని నిర్మాణుష ప్రాం తంలోకి తీసుకెళ్తున్నారు. ఈ రహదారిపై రాత్రిళ్లు మద్యం బాబులు స్థానికంగా న్యూసెన్స్ సృష్టిస్తున్నారన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: గాలిదుమారానికే కుప్పకూలుతున్నాయ్..
పట్టించుకోని పోలీసులు
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైతలాపూర్ ప్రాం తంలో అసాంఘిక కార్యక్రమాలు, మందుబాబుల ఆగడాలు జరుగుతున్నాయి. వీరిపై పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. అసాంఘిక కార్యక్రమాలు అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తాం..
ఖైతలాపూర్ ప్రాంతంలో కొనసాగుతున్న అసాంఘిక కార్యక్రమాల విషయం మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశాం. ఈ రోజు నుంచి ఖైతలాపూర్, 15ఫేజ్, డంపింగ్ యార్డు రోడ్డులో సమస్య తీవ్రంగా ఉన్న నేపధ్యంలో సిబ్బంది రాత్రిళ్లు ఎక్కవ సమయం అక్కడే ఉండేలా ఆదేశిస్తా. ప్రత్యేక డ్రైవ్ కొనసాగించి పూర్తిస్థాయిలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం.
- కృష్ణమోహన్, కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 16 , 2024 | 12:25 PM