ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: జైలుకు వెళ్లొచ్చినా చోరీలు మానలేదుగా...

ABN, Publish Date - May 22 , 2024 | 10:09 AM

బహదూర్‌పురాకు చెందిన హనీఫ్‌ క్యాబ్‌ డ్రైవర్‌. ఈనెల 19న తన కారులో బంజారాహిల్స్‌(Banjara Hills) రోడ్డు నంబర్‌-1 హయత్‌ ప్యాలెస్‌ సమీపంలోకి వచ్చాడు. వినియోగదారులు దిగాక మరో రైడ్‌ కోసం అక్కడే ఉండిపోయాడు. అలసటతో కొద్దిసేపు నిద్రపోయాడు. లేచి చూసుకునేసరికి కారు డెక్‌ మీద ఉన్న రెడ్‌ మీ సెల్‌ఫోన్‌ కనిపించలేదు.

- సెల్‌ఫోన్ల స్నాచింగ్‌, బైక్‌ల చోరీలు

- బంజారాహిల్స్‌ పరిధిలో ఇద్దరి అరెస్టు

ఒక్కొక్కరిపై డజనుకు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. ఒకరు రెండు సార్లు పీడీయాక్ట్‌ కింద జైలుకు వెళ్లగా, మరొకరు ఏడాది పాటు పీడీయాక్ట్‌ కింద జైలులో ఉండొచ్చాడు. అయినా వారిలో మార్పు రాలేదు. డబ్బు కోసం ఇళ్లలో చోరీ చేయడంతో పాటు.. స్నాచింగ్‌లకు పాల్పడతారు. ఇటీవలే సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ కేసులో పోలీసులు ఇద్దరు పాత దొంగలను అరెస్టు చేశారు.

హైదరాబాద్: బహదూర్‌పురాకు చెందిన హనీఫ్‌ క్యాబ్‌ డ్రైవర్‌. ఈనెల 19న తన కారులో బంజారాహిల్స్‌(Banjara Hills) రోడ్డు నంబర్‌-1 హయత్‌ ప్యాలెస్‌ సమీపంలోకి వచ్చాడు. వినియోగదారులు దిగాక మరో రైడ్‌ కోసం అక్కడే ఉండిపోయాడు. అలసటతో కొద్దిసేపు నిద్రపోయాడు. లేచి చూసుకునేసరికి కారు డెక్‌ మీద ఉన్న రెడ్‌ మీ సెల్‌ఫోన్‌ కనిపించలేదు. ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్చాఫ్‌ వచ్చింది. హనీఫ్‌ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో ఇద్దరు పాత దొంగల అనవాళ్లు కనిపించాయి. ఫస్ట్‌ల్యాన్సర్‌కు చెందిన సయ్యద్‌ మాజీద్‌ బెంగాలి అలియాస్‌ డాక్టర్‌, ఫయాజ్‌ ఖాన్‌గా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా సెల్‌ఫోన్‌ చోరీ చేసింది వారేనని ఒప్పుకున్నారు. సయ్యద్‌ మాజీద్‌ బెంగాలిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌(Banjara Hills Police Station) పరిధిలో 8, పంజాగుట్టలో 3, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు నమోదు అయింది. ఇవన్నీ చోరీ కేసులే కావడం గమనార్హం. ఇతడిపై పోలీసులు రెండు సార్లు పీడీ యాక్ట్‌ పెట్టి జైలుకు పంపించారు. ఫయాజ్‌ ఖాన్‌పై బంజారాహిల్స్‌ ఠాణా లో 5, నాంపల్లిలో రెండు, హుమాయున్‌నగర్‌, రెండు, గాంధీనగర్‌లో ఓ కేసు నమోదు అయింది. పీడీయాక్ట్‌పై జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇటీవలే ఏడాది వరకు తాము ఎటువంటి నేరాలు చేయమని ఎన్నికల ముందర బైండోవర్‌ కూడా అయ్యారు. కానీ వీరితీరు మాత్రం మారలేదు. నిందితుల వద్ద మొబైల్‌ ఫోన్‌ సీజ్‌ చేసి నిందితులు రిమాండ్‌కు తరలించినట్టు బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ శ్యామల వెంకట్‌రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి: దొడ్డు బియ్యం.. దొడ్డ భారం!


బంజారాహిల్స్‌లో సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌

గుర్తు తెలియని దుండగులు పాదచారి చేతిలో నుంచి సెల్‌ఫోన్‌ లాక్కొని పారిపోయారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌-7లో నివాసముండే ఆటోజు సెన్‌గుప్తా హోటల్‌లో వెయిటర్‌. మంగళవారం ఉదయం విధులు ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వెనుక నుంచి వచ్చి రూ. పదివేలు విలువ చేసే సెల్‌ఫోన్‌ లాక్కొని పారిపోయారు. ఆటోజు సెన్‌గుప్తా ఫిర్యాదు మే రకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


వాష్‌రూమ్‌లోకి వెళ్లొచ్చేలోపు చోరీ

యూసు్‌ఫగూడ: వాష్‌రూమ్‌లోకి వెళ్లొచ్చేలోపు గదిలోని వస్తువులన్నీ మాయమైన సంఘటన మధురానగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన శ్రవణ్‌కుమార్‌ అంకెమ్‌ నగరంలోని ఎల్లారెడ్డిగూడ హబీబ్‌బాగ్‌లో నివాస ముంటూ చదువుకుంటున్నాడు. ఈనెల 20వ తేదీ తన గదిలో వాష్‌రూమ్‌కి వెళ్లొచ్చేలోపు తన గదిలోని ల్యాప్‌టాప్‌, ఐపాడ్‌, లెనోవా ట్యాబ్‌, రూ. 6వేలు నగదు కనిపించలేదు. దీంతో శ్రవణ్‌కుమార్‌ మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 22 , 2024 | 10:09 AM

Advertising
Advertising