ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ద్విచక్రవాహనం రిపేర్‌ విషయంలో గొడవ.. యువకుడి హత్య

ABN, Publish Date - Mar 27 , 2024 | 11:31 AM

రోడ్డు ప్రమాదంలో పాడై పోయిన ద్విచక్ర వాహనాన్ని మరమ్మతులు చేయించే విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదంలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు.

- జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో పాడై పోయిన ద్విచక్ర వాహనాన్ని మరమ్మతులు చేయించే విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదంలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. ఈఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సుభా్‌షనగర్‌ శ్మశాన వాటిక సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జైలర్‌సింగ్‌(22), సమీర్‌ స్నేహితులు. వీరు సుభా్‌షనగర్‌లో నివాసముంటున్నారు. వీరు కొన్ని రోజులుగా వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో షెడ్‌ నిర్మాణ పనులు చేస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా జైలర్‌సింగ్‌(Jailersingh) మరికొంతమంది స్నేహితులతో కలిసి సుభా్‌షనగర్‌కు వచ్చాడు. సమీర్‌ జైలర్‌సింగ్‌ ద్విచక్రవాహనంపై సుభాష్ నగర్‌కు వచ్చాడు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనం కొంత దెబ్బతిన్నది. వాహనం రిపేర్‌ విషయమై మంగళవారం 3గంటల ప్రాంతంలో సమీర్‌ను పిలిపించి జైలర్‌సింగ్‌ కొట్టాడు. దీంతో కోపొద్రిక్తుడైన సమీర్‌ అప్పటికే తనతోపాటు తెచ్చుకున్న కత్తితో జైలర్‌సింగ్‌ను విచక్షణా రహితంగా పొడవడంతో తీవ్రరక్తస్రావమై అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం నిందితుడు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీఆస్పత్రికి తరలించారు.

Updated Date - Mar 27 , 2024 | 11:31 AM

Advertising
Advertising