ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: 14 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం..

ABN, Publish Date - May 09 , 2024 | 09:57 AM

జన్మనివ్వకపోయినా పెంచి పెద్ద చేసిన కుమార్తె పట్ల పెంపుడు తల్లి అమానుషంగా వ్యవహరించింది. బాలిక రజస్వల కాగానే ఆ చిన్నారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టింది. చెప్పినమాట వినకపోతే చిత్రహింసలకు గురి చేసి నరకయాతన పెట్టింది.

- పెంపుడు తల్లి దాష్టీకం

- బాధితురాలికి విముక్తి కల్పించిన పోలీసులు

హైదరాబాద్: జన్మనివ్వకపోయినా పెంచి పెద్ద చేసిన కుమార్తె పట్ల పెంపుడు తల్లి అమానుషంగా వ్యవహరించింది. బాలిక రజస్వల కాగానే ఆ చిన్నారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టింది. చెప్పినమాట వినకపోతే చిత్రహింసలకు గురి చేసి నరకయాతన పెట్టింది. పెంపుడు తల్లి దాష్టీకంతో వ్యభిచారం కూపంలో నలిగిపోతున్న ఆ బాలికకు పోలీసులు విముక్తి కల్పించారు. హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌(Hyderabad, Jubilee Hills) పోలీసు స్టేషన్‌ పరిధిలోని శ్రీకృష్ణనగర్‌లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంపై పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రెండ్రోజుల క్రితం దాడి చేశారు. ఇద్దరు యువతులు, విటులు, వ్యభిచార గృహ నిర్వాహకురాలిని అరెస్టు చేశారు. అక్కడే ఉన్న ఓ బాలిక(14)ను శిశు సంరక్షణాధికారులకు అప్పగించారు.

ఇదికూడా చదవండి: Gold Seized: ఎయిర్‌పోర్ట్‌లో 12 కేజీల గోల్డ్ స్వాధీనం

వివరాల సేకరణలో భాగంగా ఆ బాలిక వ్యభిచార గృహంలోకి ఎలా వచ్చింది అనే దానిపై శిశు సంక్షేమ అధికారులు దృష్టి సారించారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలే తనని చిన్న వయసులో తీసుకువచ్చి పెంచుకుందని, తాను పుష్పవతి అవ్వగానే బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నదని బాధిత బాలిక వారికి తెలిపింది. ఆమెకు ఎదురుచెబితే దారుణంగా హింసించేదని వాపోయింది. రెండు నెలల క్రితం పెంపుడు తల్లి తనకు గుండు గీయించి ఇల్లు వదిలి వెళ్లకుండా చేసిందంటూ తనకు జరిగిన అన్యాయం చెబుతూ బాధిత బాలిక కంటతడి పెట్టుకుంది. ఈ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు(Jubilee Hills Police) బాధిత బాలికను వెంటనే భరోసా కేంద్రానికి తరలించారు. కాగా, వ్యభిచార గృహ నిర్వాహకురాలితో పాటు మరికొందరిపై అత్యాచారం, బలవంతంగా వ్యభిచారంలోకి దింపడం వంటి కారణాలతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదికూడా చదవండి: Extramarital Affair: మరీ ఇంత నీచమా.. వివాహేతర సంబంధం కోసం కూతురిని..

Read Latest Crime News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 09 , 2024 | 09:57 AM

Advertising
Advertising