ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భగవంతుడా.. ఎంతపని చేశావయ్యా... ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు...

ABN, Publish Date - Apr 14 , 2024 | 10:55 AM

గుడిసెల ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలకు గురైన చిన్నారి మృతి చెందింది. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు(Petbashirabad Police) తెలిపిన వివరాలు ప్రకారం ఛత్తీస్ గఢ్‌కు చెందిన విశ్రం ప్రసాద్‌ కుటుంబ సభ్యులతో నాలుగు మాసాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు.

హైదరాబాద్: గుడిసెల ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలకు గురైన చిన్నారి మృతి చెందింది. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు(Petbashirabad Police) తెలిపిన వివరాలు ప్రకారం ఛత్తీస్ గఢ్‌కు చెందిన విశ్రం ప్రసాద్‌ కుటుంబ సభ్యులతో నాలుగు మాసాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. కుత్బుల్లాపూర్‌ గోదారిహోమ్స్‌లోని భీమ్‌కాలమ్‌ అపార్టుమెంట్స్‌ నిర్మాణం వద్ద గుడిసె వేసుకొని కూలీగా పని చేస్తున్నారు. దంపతులకు ముగ్గురు సంతానం. శుక్రవారం భార్యాభర్తలు ఇద్దరూ పనికి వెళ్లగా గుడిసె ముందు ఆడుకుంటున్న సోదరితో కలిసి చిన్నారి దీపాలి(2.5) ఆడుకుంటుండగా రెండు కుక్కలు దాడి చేశాయి. దీంతో దీపాలికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు నిలోఫర్‌కు రెఫర్‌ చేశారు. నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Danakishore: నీటి సరఫరాకు ఆటంకం కలిగించే సిబ్బందిని తొలగిస్తాం..

Updated Date - Apr 14 , 2024 | 10:57 AM

Advertising
Advertising