Hyderabad: వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఎస్సైనే బెదిరించి దోచుకున్నారు..
ABN, Publish Date - May 03 , 2024 | 12:11 PM
సీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ ప్రసాద్(CRPF SI Prasad)ను బెదిరించి దోచుకున్న నలుగురు దొంగలను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం రైల్వే పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ ఎస్. ఎన్. జావేద్, రైల్వే పీఎస్ సీఐ ఎల్లప్ప, ఆర్‌పీఎఫ్ సీఐ గోరఖ్‌నాథ్ మల్లు వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్: సీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ ప్రసాద్(CRPF SI Prasad)ను బెదిరించి దోచుకున్న నలుగురు దొంగలను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం రైల్వే పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ ఎస్. ఎన్. జావేద్, రైల్వే పీఎస్ సీఐ ఎల్లప్ప, ఆర్‌పీఎఫ్ సీఐ గోరఖ్‌నాథ్ మల్లు వివరాలు వెల్లడించారు. చంచల్‌గూడ(Chanchalguda)కు చెందిన ఇబ్రహీం ఆలియాప్ పటాన్(23), యాకత్‌పురాకు చెందిన తోహిద్ (19), రెయిన్‌బజార్‌కు చెందిన అసుసొద్దీన్ (19), పిస్తల్‌బండకు చెందిన ముఖీద్(19) ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: నకిలీ పత్రాలతో రూ. 3.13 కోట్ల మోసం..
గత నెల 26న ఎంఎంటీఎస్ రైలులో అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్న సీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ ప్రసాద్‌ను ఉప్పుగూడ - యాకత్‌పుర రైల్వేస్టేషన్ల మధ్య కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లు, రెండున్నర తులాల బంగారు చైన్, రిస్ట్‌వాచ్‌ను లాక్కొని పారిపోయారు. దీంతో ప్రసాద్ గత నెల 27న కాచిగూడ రైల్వే పోలీసు(Kachiguda Railway Police)లకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం మలక్‌పేట రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని పట్టుకుని విచారించగా.. చేసిన దొంగతనాన్ని ఒప్పుకొన్నారు. ఇబ్రహీంపై ఆరు చోరీ, ఒకటి హత్యాయత్నం కేసు, తోహిద్, అసుసొద్దీన్‌పై దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. వీరి నుంచి రెండు సెల్‌ఫోన్లు, రిస్ట్ వాచి, రెండున్నర తులాల బంగారు గొలుసు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఇదికూడా చదవండి: Hyderabad: బ్యాంకు ఖాతా నుంచి రూ.20 లక్షలు ఖాళీ.. స్కైప్ కాల్‌తో రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల వల
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 03 , 2024 | 12:11 PM