ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: నకిలీ పత్రాలతో రూ. 3.13 కోట్ల మోసం..

ABN, Publish Date - Apr 30 , 2024 | 12:29 PM

నకిలీ పత్రాలు చూపి, ప్లాట్లకు యజమానులుగా చెప్పుకుంటూ మోసానికి పాల్పడిన ముగ్గురిని సైబరాబాద్‌ ఎకనమికల్‌ అఫెన్స్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) అధికారులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌ సిటీ: నకిలీ పత్రాలు చూపి, ప్లాట్లకు యజమానులుగా చెప్పుకుంటూ మోసానికి పాల్పడిన ముగ్గురిని సైబరాబాద్‌ ఎకనమికల్‌ అఫెన్స్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) అధికారులు అరెస్ట్‌ చేశారు. నార్సింగ్‌(Nursing) ప్రాంతానికి చెందిన పత్తి శ్రీకాంత్‌రావు(54), అతడి భార్య, పత్తి ప్రేమలత(38), దర్శనం శివరాజ్‌ (45) ముగ్గురు నార్సింగ్‌ సర్వేనెంబర్‌ 298లో ఉన్న 30 ప్లాట్లు పౌల్ట్రీ ఫామ్స్‌ బెనిఫిషరీస్‌ ఎక్ట్సాబ్లిష్మెంట్‌ యాక్ట్‌ ప్రకారం తమకు చెందాయని, తామే హక్కుదారులమని చెప్పుకున్నారు. సర్వే నెంబర్‌లోని 30ప్లాట్లలో కొన్నింటికి విక్రయించేందుకు ఎన్‌ఓసీ ఉందని, మరికొన్ని ప్లాట్లకు ఎన్‌ఓసీ వస్తుందని చెబుతూ సూర్యా డెవలపర్స్‌ నిర్వాహకుడు సీహెచ్‌ శ్రీనివాస రావు(CH Srinivasa Rao)కు విక్రయించే ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇదికూడా చదవండి: TS News: రాహిల్‌‌ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ కం జీపీఏ చేస్తామని చెప్పి, శ్రీనివాసరావు నుంచి రూ.3.13 కోట్లు వసూలు చేశారు. రోజులు గడుస్తున్నా జీపీఏ చేయకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని శ్రీనివాసరావు కోరగా, వారు రెండు చెక్కులు ఇచ్చారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేకపోవడంతో చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. బాధిడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగ్‌ పోలీసులు, ఈఓడబ్ల్యూ విభాగానికి బదిలీ చేశారు. డీసీపీ కె ప్రసాద్‌ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన ఈఓడబ్ల్యూ ఇన్‌స్పెక్టర్‌ బి నరహరి ముగ్గురు నిందితులు శ్రీకాంతరావు, ప్రేమలత, శివరాజ్‌లను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు.

ఇదికూడా చదవండి: Madhukar Reddy: కాంగ్రెస్‌ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 12:32 PM

Advertising
Advertising