Krishnagiri: మరణంలోనూ వీడని బంధం..
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:19 PM
ఆరు దశాబ్దాల పాటు కలిసి కాపురం చేసిన దంపతుల్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. ఆద్యంతం అన్యోన్యంగా గడిపిన ఆ దంపతులు ఒకేరోజు రాత్రి నిద్రలోనే మరణించడం పలువురిని కలసిచివేసింది.
- ఒకేరోజు కన్నుమూసిన వృద్ధ దంపతులు
- కృష్ణగిరి జిల్లాలో ఘటన
చెన్నై: ఆరు దశాబ్దాల పాటు కలిసి కాపురం చేసిన దంపతుల్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. ఆద్యంతం అన్యోన్యంగా గడిపిన ఆ దంపతులు ఒకేరోజు రాత్రి నిద్రలోనే మరణించడం పలువురిని కలసిచివేసింది. వివరాలిలా... కృష్ణగిరి(Krishnagiri) జిల్లా డెంకణికోట సమీపంలోని మేగలపుండనూరు గ్రామానికి చెందిన గోవిందస్వామి (90), రామక్క (75) దంపతులకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలున్నారు.
అందరికి వివాహమై వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గోవిందస్వామి పిల్లలు కొంతమంది తల్లిదండ్రుల కు ఆహారం అందించి వెళ్లారు. అయితే రాత్రి నిద్రపోయిన దంపతులు ఆదివారం ఉదయం ఎంతసేపటికీ లేవలేదు. దీంతో ఇరుగుపొరుగు వారు లేపేందుకు ప్రయత్నించగా, అచేతనంగా పడివున్నారు. అప్పటికే వారిద్దరూ తుదిశ్వాస విడిచినట్లు తేలింది.
ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 03 , 2024 | 12:21 PM