ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttar Pradesh: ఎంత కర్కోటకుడు.. పుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చి ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే..

ABN, Publish Date - Sep 16 , 2024 | 05:04 PM

ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. పుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చి మరీ దారుణంగా చంపాడు. రెండేళ్ల క్రితమే వారికి పెళ్లి జరిగింది. అప్పట్నుంచి కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడు. తనకు కట్నంగా టీవీఎస్ అపాచీ, రూ.3 లక్షలు కావాలని అడుగుతున్నాడు.

Husband killed wife

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. పుట్టింటి నుంచి భార్య (Wife)ను తీసుకొచ్చి మరీ దారుణంగా చంపాడు. రెండేళ్ల క్రితమే వారికి పెళ్లి జరిగింది. అప్పట్నుంచి కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడు (Dowry Harassment). తనకు కట్నంగా టీవీఎస్ అపాచీ, రూ.3 లక్షలు కావాలని అడుగుతున్నాడు. అమ్మాయి కుటుంబం అవి ఇవ్వకపోవడతోనే ఆ యువకుడు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితులను అరెస్ట్ చేశారు (Crime News).


యూపీలోని అమ్రోహాకు సమీపంలోని బైఖేడా గ్రామానికి చెందిన సుందర్‌కు మీనా అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే సుందర్ కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడు. ఈ వేధింపుల గురించి మీనా తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. తరచుగా కొడుతుండడంతో భర్త ఇంటిని వదిలేసిన మీనా కొన్ని నెలలుగా తల్లిదండ్రుల ఇంట్లోనే నివసిస్తోంది. సుందర్ అప్పుడప్పుడు తన భార్యను చూసేందుకు వెళ్లేవాడు. అత్తమామల ఇంట్లో భోజనం కూడా చేసేవాడు.


ఆదివారం రాత్రి కూడా అలాగే మీనా పుట్టింటికి వెళ్లాడు. మీనాను ఒప్పించి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లగానే భార్యతో కట్నం కోసం గొడవ పెట్టుకున్నాడు. ఆమెను కర్రతో కొట్టాడు. అనంతరం గొంతునులిమి చంపి పారిపోయాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీనా తండ్రి విజయ్ ఖడక్ బన్షీ పోలీసులకు ఫిర్యాదు మేరకు సుందర్, అతని తల్లి, సోదరి, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి..

Hyderabad: 11 గంటలు.. 102 సీసీ కెమెరాలు...


Hyderabad: ఆన్‌లైన్‌ షాపింగ్‌తో జర పైలం...


మరిన్ని క్రైమ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 16 , 2024 | 05:04 PM

Advertising
Advertising