ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AI Scam: వామ్మో పేరెంట్స్ లక్ష్యంగా కొత్త ఏఐ స్కామ్.. ఇది మీకు తెలుసా?

ABN, Publish Date - Mar 13 , 2024 | 11:23 AM

ఇటివల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో పెద్ద ఎత్తున సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు వెలుగులోకి వచ్చిన సంఘటనలు చుశాం. ఇప్పుడు తాజాగా ఏఐ పేరుతో మరో స్కాం(AI scam) వెలుగులోకి వచ్చింది.

ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పేరుతో పెద్ద ఎత్తున సెలబ్రిటీల డీప్‌ఫేక్(deepfake) వీడియోలు వెలుగులోకి వచ్చిన ఘటనలు చుశాం. ఇప్పుడు తాజాగా ఏఐ పేరుతో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే ఏఐ వాయిస్ క్లోన్ ఫ్రాడ్ (Ai Voice cloning fraud). దీని ద్వారా దుండగులు ఏకంగా వ్యక్తుల స్నేహితులు లేదా బంధువులు, తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల వాయిస్‌ని క్లోనింగ్ చేసి ఫేక్ కాల్స్ చేస్తున్నారు. సాయం లేదా ఇతర పేర్లు మీద డబ్బులు అడుగుతున్నారు. దీని గురించి తెలుసుకునేలోపే సదురు వ్యక్తులు మోసపోతున్నారు. ఈ అంశం పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(delhi ncr) పరిధిలో వెలుగులోకి వచ్చింది. కావేరి అనే మహిళ ఈ అంశం పట్ల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాను పోలీస్ అధికారినని ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు. అంతేకాదు తన కుమార్తె ఇబ్బందుల్లో ఉందని చెప్పారని ఆమె తెలుపుతూ ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.


మరో ఘటనలో ఢిల్లీకి చెందిన ఒక మహిళకు కెనడా నుంచి తన సోదరుడి కొడుకు నుంచి కాల్(call) వచ్చింది. అతను తన కారు ప్రమాదానికి గురైందని తన అత్తకు చెప్పాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని బెయిల్ కోసం డబ్బులు కావాలని కోరాడు. దీంతో ఆ మహిళ AI కాల్‌ని తన సోదరుడి కుమారుడి వాయిస్‌గా తప్పుగా భావించి డబ్బును బదిలీ చేసింది. కానీ ఆమె ఆ తర్వాత తన సోదరుడి కుమారుడికి కాల్ చేసినప్పుడు తాను మోసపోయానని ఆమె తర్వాత తెలుసుకుని పోలీసులకు తెలిపింది.

అయితే ఈ నేరస్థులు ఇలాంటి స్కామ్స్ కోసం అధునాతన ఏఐ(AI) సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా తెలిసిన వారి వాయిస్ క్లోన్ చేసి తమ పిల్లలు ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నట్లు మాట్లాడతారు. ఆ తర్వాత వెంటనే డబ్బులు(money) పంపమని అడిగి, మీ కాల్‌లను పికప్ చేయడం ఆపేస్తారు. అది మీరు నిజమని నమ్మి డబ్బులు పంపితే మోసపోయినట్లే జాగ్రత్త.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Hyderabad: ఇద్దరి దారుణ హత్య.. ఎల్‌బీనగర్‌లో గొంతు కోసి యాచకురాలిని.. శాలివాహననగర్‌ కాలనీలో పారతో బాది భార్యను..

Updated Date - Mar 13 , 2024 | 11:37 AM

Advertising
Advertising