Murder: ఆలిపై అరాచకం.. భార్యను హత్య చేసి ముక్కలుగా కోసి..
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:26 AM
తన అల్లరి తిరుగుళ్లను నిలదీస్తోందన్న కోపంతో కట్టుకున్న భార్యను హతమార్చాడో దుర్మార్గుడు. అంతేగాక ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, ఎవ్వరూ గుర్తు పట్టకుండా అటవీప్రాంతంలో విసిరేశాడు. అయితే పోలీసుల విచారణలో ఈ విషయం తేటతెల్లం కావడంతో చివరికి తను చేసిన తప్పును అంగీకరించాడు.
- తిరువణ్ణామలైలో దారుణం
- భార్యను హత్య చేసి ముక్కలుగా కోసిన భర్త
చెన్నై: తన అల్లరి తిరుగుళ్లను నిలదీస్తోందన్న కోపంతో కట్టుకున్న భార్యను హతమార్చాడో దుర్మార్గుడు. అంతేగాక ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, ఎవ్వరూ గుర్తు పట్టకుండా అటవీప్రాంతంలో విసిరేశాడు. అయితే పోలీసుల విచారణలో ఈ విషయం తేటతెల్లం కావడంతో చివరికి తను చేసిన తప్పును అంగీకరించాడు. తిరువణ్ణామలై(Tiruvannamalai) జిల్లాలో కలకలం రేపిన ఈ హత్యోదంతం వివరాలిలా వున్నాయి...
తిరువణ్ణామలైలోని పేయిగోపురం మెయిన్ రోడ్డుకు చెందిన గోపి (36) మొదటి భార్యను వదిలేసి, 12 ఏళ్లక్రితం శరణ్య (29) అనే మహిళను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీ నుంచి శరణ్య కనిపించలేదు. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. తన తల్లి ఇంటికి రాకపోవడంతో కుమార్తె ఆందోళన చెందుతూ అమ్మమ్మకు చెప్పింది. ఆమె తమ కుటుంబ సభ్యులను విచారించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో తిరువణ్ణామలై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణగిరి జిల్లా అటవీ ప్రాంతంలోని ఒక వంతెన కింది ఓ మహిళ మృతదేహం ముక్కలు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో అక్కడకు పోలీసులు వెళ్ళి చూడగా, ఆ శరీర భాగాలు శరణ్యవిగా తేలింది. అయితే, అక్కడ శరణ్య తల, హృదయభాగం, ఒక తొడ భాగం మాత్రమే లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని పంచనామా కోసం తరలించారు. అనంతరం గోపిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అతను అసలు విషయం కక్కేశాడు. కొంతకాలంగా తమ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పాడ్డాయని, దానికితోడు తనకు అప్పులు పెరగడంతో తమ మధ్య వివాదానికి కారణమైందని గోపి వెల్లడించాడు.
తన తిరుగుళ్లను నిత్యం ఆమె నిలదీస్తుండడంతో భరించలేక హత్య చేశానని, అనంతరం ఎవ్వరూ గుర్తు పట్టకుండా శరీరాన్ని 8 ముక్కలుగా కోశానని అంగీకరించాడు. ఆమె శరీర భాగాలను తన తల్లి శివగామి, స్నేహితుడు రాజేంద్రన్(Rajendran) సాయంతో కృష్ణగిరి అటవీ ప్రాంతంలో పడేసినట్టు అంగీకరించాడు. ఈ హత్య కేసులో సహకరించిన తల్లి శివగామి, స్నేహితుడు రాజేంద్రన్లను పోలీసులు అరెస్టు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్లో యాచకుడికి ఐపీ నోటీసు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 12 , 2024 | 11:26 AM