Navy Seizes: ఏకంగా 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. కేంద్ర హోంమంత్రి అభినందన
ABN, Publish Date - Feb 28 , 2024 | 01:17 PM
భారత నావికాదళం ప్రత్యేక ఆపరేషన్‌లో సెయిలింగ్ బోట్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేయగా..వారి నుంచి ఏకంగా 3300 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.
భారత నౌకాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్(drugs) పట్టిపడింది. గుజరాత్(gujarat) తీరంలో ఈ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ పడవలో అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఐదుగురు విదేశీయులను అరెస్టు చేయగా.. వారి నుంచి 3,300 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ స్టాక్‌పై 'ప్రొడ్యూస్డ్ ఇన్ పాకిస్థాన్' అని రాసి ఉంది. అందులో 3,089 కిలోల హషీష్, 158 కిలోల మెథాంఫేటమిన్, 25 కిలోల మార్ఫిన్ వంటివి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
అంతేకాదు ఇటీవలి కాలంలో స్వాధీనం చేసుకున్న అతిపెద్ద మొత్తాలలో ఇది ఒకటని పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న పడవ, సిబ్బందితో పాటు నిషిద్ధ వస్తువులను స్థానిక పోలీసులకు అప్పగించారు. సిబ్బందిలో ఐదుగురు పాకిస్థానీలుగా అనుమానిస్తున్నారు. అనుమానిత పాకిస్థానీ సిబ్బంది గురించి మరింత సమాచారాన్ని సేకరించి, మాదక ద్రవ్యాల మూలం, గమ్యాన్ని కనుగొనడానికి దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అరేబియా సముద్రంలో కొనసాగుతున్న సముద్ర భద్రత పరిస్థితులకు ప్రతిస్పందనగా భారత నావికాదళం(Navy) ప్రత్యేక బలగాలను మోహరించింది.
ఈ ఆపరేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) బుధవారం స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ "డ్రగ్స్ ఫ్రీ ఇండియా విజన్"ని ముందుకు తీసుకెళ్లినందుకు అమలు చేస్తున్న సంస్థలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ చారిత్రాత్మక విజయం మన దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు మన ప్రభుత్వం చూపుతున్న తిరుగులేని నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్‌సీబీ, నేవీ, గుజరాత్ పోలీసులను అభినందిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Four labourers died: గనిలో విరిగిపడిన బండలు.. నలుగురు కార్మికులు మృతి
Updated Date - Feb 28 , 2024 | 01:23 PM