ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఎంత కిరాతకం.. ఏడు నెలల బాబుపై కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియోను చూడండి..!

ABN, Publish Date - Jul 21 , 2024 | 01:07 PM

అమెరికాలో గత వారం ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కిరాతక మహిళ అభం శుభం తెలియని చిన్నారిపై, తనకు పరిచయం కూడా లేని వ్యక్తులపై కాల్పులకు తెగబడింది. ఏడు నెలల బాబుపై అత్యంత కర్కోటకంగా కాల్పులు జరిపింది. ఆ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది.

Philadelphia woman arrested after shooting at infant

అమెరికా (America)లో గత వారం ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కిరాతక మహిళ అభం శుభం తెలియని చిన్నారి (Infant)పై, తనకు పరిచయం కూడా లేని వ్యక్తులపై కాల్పులకు (Firing) తెగబడింది. ఏడు నెలల బాబుపై అత్యంత కర్కోటకంగా కాల్పులు జరిపింది. ఆ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మహిళను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని ఫిలడెల్ఫియాకు చెందిన డొమినిక్ బిలిప్స్‌గా గుర్తించారు.


ఈ దారుణ ఘటన ఫిలడెల్ఫియా (Philadelphia)లోని నగరంలోని హోమ్స్‌బర్గ్ సెక్షన్‌లో గత వారం చోటుచేసుకుంది. ఒక ఇంటి బయట తమ ఏడు నెలల బాబును స్ట్రోలర్‌లో పెట్టుకుని నడుస్తున్న దంపతులపై బిలిప్స్ అకారణంగా కాల్పులు జరిపింది. ఆ దంపతులపై, ఆ చిన్నారిపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఫైరింగ్ చేసింది. ఆ దంపతులు ఆ కాల్పుల నుంచి తప్పించుకున్నారు. ఆ చిన్నారి పాదంలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే తమ చిన్నారిని తీసుకుని ఆ దంపతులు ఆస్పత్రికి పరుగులు తీశారు. ప్రస్తుతం ఆ బాబు ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది.


ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికి అక్కడ ఎవరూ లేరు. దాదాపు గంట తర్వాత ఆ చిన్నారి, అతడి తల్లిదండ్రుల ఆచూకీ పోలీసులకు దొరికింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని పోలీసులు గుర్తించారు. తాజాగా ఆమెను అరెస్ట్ చేశారు. ఆ పసికందు తండ్రి మీద కోపంతోనే నిందితురాలు దాడికి తెగబడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఇలాంటి భర్త కోసం ఎన్ని పూజలైనా చేస్తాం.. భార్యతో కలిసి అతడు చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!


Picture Puzzle: ఈ పిల్లులకు హెల్ప్ చేస్తారా? ఆ నీటిలో ఎలుక ఎక్కడుందో 10 సెకెన్లలో వెతికిపెట్టండి..!


మరిన్ని క్రైమ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 21 , 2024 | 01:08 PM

Advertising
Advertising
<