Prison: జైలులో అవ్వ.. 93 ఏళ్ల వయసులో వరకట్నం శిక్ష
ABN, Publish Date - Nov 19 , 2024 | 12:55 PM
వరకట్నం కేసులో 93 ఏళ్ల వృద్ధురాలు జైలులో శిక్ష అనుభవిస్తుండడాన్ని గమనించిన ఉప లోకాయుక్త స్పందించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కలబురిగి(Kalaburigi) జిల్లా పర్యటనలో ఉన్న ఉపలోకాయుక్త శివప్ప శనివారం స్థానిక సెంట్రల్‌జైలును సందర్శించారు. ఖైదీలతో అక్కడి వసతులు, ఇతరత్రా అంశాలపై ఆరా తీశారు.
- కలబురగి సెంట్రల్ జైలులో వృద్ధురాలు
- సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని ఉప లోకాయుక్త సూచన
బెంగళూరు: వరకట్నం కేసులో 93 ఏళ్ల వృద్ధురాలు జైలులో శిక్ష అనుభవిస్తుండడాన్ని గమనించిన ఉప లోకాయుక్త స్పందించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కలబురిగి(Kalaburigi) జిల్లా పర్యటనలో ఉన్న ఉపలోకాయుక్త శివప్ప శనివారం స్థానిక సెంట్రల్‌జైలును సందర్శించారు. ఖైదీలతో అక్కడి వసతులు, ఇతరత్రా అంశాలపై ఆరా తీశారు. ఇదే సమయంలో ఓ అవ్వకు తోటి ఖైదీలు సేవలు చేస్తుండడాన్ని గమనించారు. నేరుగా ఆమె వద్దకు వెళ్లి వివరాలు ఆరా తీశారు.
ఈ వార్తను కూడా చదవండి: Snow: మంచుదుప్పటిలో ఏర్కాడు.. చలికి వణకుతున్న పర్యాటకులు
93ఏళ్ల నాగమ్మకు వరకట్నం కేసులో మూడేళ్ల జైలుశిక్ష పడినట్లు జైలు అధికారులు అధికారులు తెలిపారు. వయోభారం కారణంగా ఆమె ఎటువంటి పనులు చేసుకోలేదని, తోటి ఖైదీలు సహకరిస్తున్నారని జైలు సూపరింటెండెంట్ అనిత వివరించారు. నాగమ్మకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్(Medical reports) సిద్ధం చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ శశిధర్‌శెట్టికి ఫోన్ చేసి నాగమ్మ కేసు వివరాలు తెలిపారు. జిల్లా న్యాయసేవల ప్రాధికార సభ్యుడు శ్రీనివాస్ నవలెకు పిటీషన్ దాఖలుకు కోరారు.
జైలులో వంటగదితోపాటు ఖైదీలు ఉండే ప్రదేశాన్ని పరిశీలించారు. ఓ ఖైదీ పదేళ్ల జైలుశిక్షకు గురయ్యానని, ఒకసారి కూడా పెరోల్ ఇవ్వలేదని వాపోయారు. అయితే ఇదే జైలులో పెరోల్‌పై బయటకు వెళ్లినవారు తప్పించుకుని కొన్ని నెలల తర్వాత పట్టుబడిన అంశాన్ని సూపరింటెండెంట్ గుర్తు చేశారు. పదేళ్లు జైలులో ఉంటే పెరోల్ వెసలుబాటు కల్పించవచ్చునని ఉపలోకాయుక్త సూచించారు. కలబురగి పోలీస్ కమిషనర్ డాక్టర్ శరణప్ప, ఎస్పీ అడ్డూరు శ్రీనివాసులు, లోకాయుక్త ఎస్పీ బీకే ఉమేశ్, డీసీపీ కన్నికా సెక్రివాల్‌లు ఉన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్ పరిస్థితే లగచర్లలోనూ..
ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్ హయాంలో సర్వేతో దోపిడీ
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్ ప్రవర్తన
Read Latest Telangana News and National News
Updated Date - Nov 19 , 2024 | 12:55 PM