ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PTC: వార్ని.. ఇక మామూలు ఇళ్ల పరిస్థితి ఏంటో.. పోలీసు శిక్షణ కళాశాలలో చోరీ !

ABN, Publish Date - Mar 30 , 2024 | 10:41 AM

స్థానిక అశోక్‌నగర్‌లో ఉన్న పోలీసు శిక్షణ కళాశాల(Police Training College)లో చోరీకి యత్నించిన యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఈ శిక్షణ కళాశాల ప్రాంగణంలో ఆర్ధికనేర విభాగం ప్రధాన కార్యాలయం కూడా పనిచేస్తుంది.

చెన్నై: స్థానిక అశోక్‌నగర్‌లో ఉన్న పోలీసు శిక్షణ కళాశాల(Police Training College)లో చోరీకి యత్నించిన యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఈ శిక్షణ కళాశాల ప్రాంగణంలో ఆర్ధికనేర విభాగం ప్రధాన కార్యాలయం కూడా పనిచేస్తుంది. ఇక్కడ పలు కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రాల వాహనాలను ఉంచారు. ప్రతిరోజు సాయంత్రం క్రైం ఇన్స్‌పెక్టర్‌ నందిని నేతృత్వంలోని పోలీసులు, స్వాధీనం చేసుకున్న వాహనాలు లెక్కిస్తుంటారు. అదే విధంగా గురువారం సాయంత్రం వాహనాలు నిలిపిన ప్రాంతంలో చొరబడిన వ్యక్తి ఓ మోటార్‌ సైకిల్‌ వెనుక చక్రాన్ని విప్పుతుండడాన్ని పోలీసులు గుర్తించారు. భారీ భద్రత ఉన్న ఆ ప్రాంతంలో చేతివాటం చూపిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేకే నగర్‌ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. విచారణలో, అతను గిండికి చెందిన దీన (21) అని తెలిసింది. అతడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 30 , 2024 | 10:41 AM

Advertising
Advertising