Salman Khan: సల్మాన్ ఖాన్ కాల్పుల ఘటన.. నిందితుడి గుర్తింపు, పోలీస్ వాహనం మిస్సింగ్
ABN, Publish Date - Apr 15 , 2024 | 01:41 PM
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు(police) గుర్తించినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు అంటున్నారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న యువకుడు విశాల్ రాహుల్ అలియాస్(కాలూ) అని పోలీసులు చెబుతున్నారు. కానీ కాల్పుల రోజున ఓ పోలీస్ వాహనం మిస్సైన విషయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు(police) గుర్తించినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు అంటున్నారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న యువకుడు విశాల్ రాహుల్ అలియాస్(కాలూ) అని పోలీసులు చెబుతున్నారు. యువకుడు 10వ తరగతి వరకు చదువుకున్నాడని, అతనిపై ఐదుకు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
ఆదివారం తెల్లవారుజామున నటుడు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటనపై ముంబై(Mumbai) పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నటుడి ఇంటికి కిలోమీటరు దూరంలో ఓ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని, దాడికి పాల్పడిన వ్యక్తులు దానిని ఉపయోగించినట్లు వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటన సమయంలో సల్మాన్ ఇంటి ముందు ఉండే ఓ పోలీస్ వాహనం(police vehicle) ఆదివారం ఉదయం కాల్పుల సమయంలో అక్కడ లేదని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దీనిపై కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ కేసును ప్రస్తుతం ముంబై క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తుండగా, ఏటీఎస్, ఎన్‌ఐఏ అధికారులు కూడా ఈ ఘటనపై సమాచారం తెలుసుకుంటున్నారు. కాల్పుల తర్వాత ఘటనా స్థలంలో ఐదు ఖాళీ షెల్స్, ఒక బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఖాళీ షెల్ సల్మాన్ ఇంటి బాల్కానీలో గుర్తించగా, ఆ సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసు దర్యాప్తు కోసం 15 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్(lawrence bishnoi) సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ తర్వాత కరుడుగట్టిన నేరస్థుడు రోహిత్ గోదారా పేరు కూడా ఈ కేసులో తెరపైకి వచ్చింది. విశాల్ రాజస్థాన్ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదార షూటర్. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో రోహిత్‌కు సంబంధం ఉంది. సల్మాన్ ఇంటికి సంబంధించిన కేసులో షూటర్లు హర్యానాతో ముడిపడి ఉండటంతో హర్యానా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
గతంలో కూడా సల్మాన్(Salman Khan)ను చాలాసార్లు దెబ్బతీసేందుకు పలువురు ప్రయత్నించారు. మార్చి 2023లో సల్మాన్ కార్యాలయానికి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఆ తర్వాత ముంబై పోలీసులు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ సహా మరొకరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికంటే ముందు 2022 జూన్‌లో కూడా ఓ గుర్తుతెలియని వ్యక్తి సల్మాన్‌ను బెదిరించారు.
ఇది కూడా చూడండి:
FBI: ఈ వ్యక్తిని పట్టుకుంటే రెండు కోట్ల రూపాయల రివార్డ్.. FBI ఆఫర్
భగవంతుడా.. ఎంతపని చేశావయ్యా... ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు...
మరిన్ని క్రైం వార్తల కోసం
Updated Date - Apr 15 , 2024 | 01:47 PM