ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

illegal liquor: ఎడ్ల బండిలో రవాణా చేస్తున్న అక్రమ మద్యం స్వాధీనం.. పారిపోయిన స్మగ్లర్లు, అదుపులో ఎడ్లు

ABN, Publish Date - Feb 15 , 2024 | 07:28 PM

బిహార్ రాష్ట్రంలో మద్యపానం పూర్తిగా నిషేధం. కానీ రాష్ట్రంలో రోజుకో కొత్త మార్గాల్లో మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. అయితే ఎడ్ల బండిలో మద్యం రవాణా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బిహార్ రాష్ట్రంలో మద్యపానం పూర్తిగా నిషేధం. కానీ రాష్ట్రంలో రోజుకో కొత్త మార్గాల్లో మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. అయితే ఎడ్ల బండిలో మద్యం రవాణా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో కార్లు, బస్సులు, ఆటోలు, బైక్స్ వంటి వాహానాల్లో మద్యం అక్రమంగా తీసుకెళ్లడం చుశాం. కానీ తాజాగా ఎడ్ల బండిలో మద్యం తీసుకెళ్లడం ఎప్పుడూ చూడలేదని పోలీసులు కూడా చెబుతున్నారు. ఈ ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్ పరిధిలో చోటుచేసుకుంది.


సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎడ్ల బండిలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో ఎద్దుల బండి నుంచి రూ.5 లక్షల విలువైన ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులను చూసి స్మగ్లర్లు ఎద్దుల బండిని వదిలి పారిపోయారు. మద్యం నింపిన ఎద్దుల బండిని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. మద్యం డబ్బాలను లెక్కించగా 107 అట్టపెట్టెల్లో 963 లీటర్ల మద్యం ఉన్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మద్యం సరుకును పోలీస్ స్టేషన్‌లో దించి, ఎద్దుల బండి, ఎద్దులను బంజరిలోని గోదాములో ఉంచారు.

Updated Date - Feb 15 , 2024 | 07:28 PM

Advertising
Advertising