ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: అన్నా.. నేను చనిపోతున్నా.. తిరుమల నుంచి సెల్ఫీ వీడియో పంపిన యువతి

ABN, Publish Date - Nov 30 , 2024 | 11:51 AM

తన భర్తతో జరిగిన గొడవ కారణంగా తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఓ యువతి తిరుమల(Tirumala) నుంచి తన అన్నకు వీడియో పంపింది. దీనిపై అతడు నిమిషాల వ్యవధిలో ఇక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గంట వ్యవధిలోనే ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- పోలీసులను ఆశ్రయించిన సోదరుడు

- గంట వ్యవధిలోనే యువతిని గుర్తించిన టూటౌన్‌ పోలీసులు

తిరుమల: తన భర్తతో జరిగిన గొడవ కారణంగా తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఓ యువతి తిరుమల(Tirumala) నుంచి తన అన్నకు వీడియో పంపింది. దీనిపై అతడు నిమిషాల వ్యవధిలో ఇక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గంట వ్యవధిలోనే ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. తమిళనాడు(Tamilnadu)లోని హోసూర్‌కు చెందిన శంకర్‌, భావన దంపతులకు ఇద్దరు పిల్లలు. భర్తతో జరిగిన గొడవ కారణంగా గురువారం రాత్రి ఆమె ఇంటి నుంచి తిరుమలకు బయలుదేరింది.

ఈ వార్తను కూడా చదవండి: Minister: రాష్ట్రంలో 2,553 వైద్య పోస్టుల భర్తీ..


శుక్రవారం ఉదయం ఆమె శ్రీవారిమెట్టు మార్గం నుంచి ‘నా భర్తతో గొడవ జరిగింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నా’ అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి వాట్సాప్‌(WhatsApp) ద్వారా బెంగుళూరులోని తన అన్న ప్రసాద్‌కు పంపింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోను చేసినా ఈమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఉదయం పదిన్నర గంటల సమయంలో కంట్రోల్‌ రూమ్‌ నుంచి తిరుమల(Tirumala) పోలీసులను ప్రసాద్‌ ఆశ్రయించి, తన చెల్లిని కాపాడాలని కోరారు.


వెంటనే టూటౌన్‌ సీఐ శ్రీరాముడు ఆధ్వర్యంలో రెండు బృందాలు ఆ సెల్ఫీ వీడియో సాయంఓ భావన కదలికలపై సీసీ కెమెరాల ఫుటేజ్‌, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిఘా పెట్టి.. గాలించారు. 11.30 గంటల సమయంలో తిరుమలలోని ఎస్వీ గెస్ట్‌హౌస్‌ వద్ద భావనను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారికి ఆమెను అప్పగించి.. ఆ యువతికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు.


ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2024 | 11:51 AM