ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lord Vinayaka: వినాయకుడి విగ్రహాన్ని ఏ సమయంలో ప్రతిష్టించాలి

ABN, Publish Date - Sep 06 , 2024 | 10:42 AM

దేశవ్యాప్తంగా వినాయకుడి వేడుకలకు(Ganesh Chaturthi 2024) సర్వం సిద్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక మండపాలకు విగ్రహాలు తరలించే వేళైంది.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా వినాయకుడి వేడుకలకు(Ganesh Chaturthi 2024) సర్వం సిద్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక మండపాలకు విగ్రహాలు తరలించే వేళైంది. ఇప్పటికే వేల సంఖ్యలో గణనాథులు పూజలందుకునేందుకు సిద్ధమయ్యారు. శనివారం ఉదయమే తొలిపూజ అందుకోనున్నాడు. లంబోదరుడిని ఏ సమయంలో ప్రతిష్టించాలి. పూజ సమయంలో చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం.. ఈ ఏడాది వినాయక చవితి తిథి సెప్టెంబర్ 6,7 తేదీల్లో ఉంటుందని పురోహితులు అంటున్నారు.

ధృక్ సిద్ధాంతం ప్రకారం శనివారమే చవితి పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11.03 నుంచి మధ్యాహ్నం1.30 గంటల మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపనకు శుభముహూర్తం ఉందని చెప్పారు. సాయంత్రం 6.22 నుంచి రాత్రి 7.30 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం పూజ చేయాలని చెబుతున్నారు. ఈ రెండు స‌మ‌యాల్లో విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజ‌లు చేయ‌డం వ‌ల్ల అన్నీ శుభాలే జ‌రుగుతాయ‌ని పురోహితులు అంటున్నారు.


ఏ వస్త్రాలు ధరించాలంటే..

గ‌ణనాథుడికి ఎరుపు రంగు వ‌స్త్రాలంటే ఎంతో ఇష్టం. కాబట్టి వినాయ‌క చ‌వితి రోజున ఆ రంగు వ‌స్త్రాలు ధ‌రిస్తే మంచిదట. దీనికితోడు ఈ ఏడాది చవితి శ‌నివారంనాడు వ‌చ్చింది. శ‌నివారానికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి.. ఆయనకు ఇష్టమైన నీలం రంగు దుస్తులు ధరించినా మంచిదని చెబుతున్నారు. కాబట్టి రేపు ఎరుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదట.

పూజలో భాగంగా జిల్లేడు ఒత్తుల దీపం వెలిగించాలని పండితులు సూచిస్తు్న్నారు. ప్రమిదలో కొబ్బరినూనె పోసి ఐదు జిల్లేడు ఒత్తులు విడిగా వేసి, దీపం పెడితే వినాయకుడి అనుగ్రహం సంపూర్ణంగా మనపై ఉంటుందట. అలాగే పండగ నాడు 21 పత్రాలతో గణపతిని పూజించడం వీలుకాని వారు.. గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పిస్తే 21 ప్రతాలతో ఆయనను పూజించిన లభిస్తుందని చెబుతున్నారు.


కొనుగోలు చేసేటప్పుడు..

బొజ్జ గణపయ్య.. కూర్చుని ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా.. ప్రకృతికి దగ్గరగా ఉండే మట్టి గణపయ్యను తీసుకోవడం ఎంతో మంచిది. విగ్రహానికి కిరీటం ఉండాలి. అలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజించడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని అంటున్నారు. లేత గంధం రంగు గణపతి విగ్రహాన్ని పూజించడం ఉత్తమం. ఎలుక విగ్రహంలో కలిసి ఉండాలి. ఇది ఇంటిపై ఇతరులకు విశ్వాసం పెంచేలా చేస్తుంది. వృత్తి జీవితం సంతృప్తికరంగా ఉంటుందట. గణేషుడి చేతిలో మోదకం తప్పనిసరిగా ఉండాలి.


తొండం దిశ ముఖ్యం..

వినాయకుడి తొండం ఎప్పుడూ కుడివైపు తిరిగి ఉండకూడదంట. ఎడమ వైపు తిరిగి ఉండాలని పూజారులు చెబుతున్నారు. కుడివైపున తొండం ఉన్న విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయట. వినాయకుడిని ఎంతో నిష్టతో, నిబద్ధతో ఆరాధించాలి.

పూజలో కూర్చునే రోజు మద్యం, మాంసం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదు. మనసు పరిమళంగా ఉంచుకోవాలి. దేవుడిపై ఏకాగ్రత, భక్తి నిలపాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉంటుందని పూజారులు చెబుతున్నారు.

For Latest News click here

Updated Date - Sep 06 , 2024 | 10:55 AM

Advertising
Advertising