ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dhantrayodashi 2024: ధనత్రయోదశి రోజు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది

ABN, Publish Date - Oct 29 , 2024 | 03:55 PM

ధనత్రయోదశి రోజు.. ఒక చిన్న చెంచాను సైతం కొనుగోలు చేయాలని వారు వివరిస్తున్నారు. ఇది చాలా శుభప్రదమైందని వారు పేర్కొంటున్నారు. ఈ రోజు ధనవంతులు సైతం చెంచా కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళ్తారని వారు వివరిస్తున్నారు.

ధనత్రయోదశి.. హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు అత్యధికులు... అంటే కోటీశ్వరుల నుంచి సామాన్యల వరకు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. వీటితో పాటు మరో వస్తువు కోనుగోలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. ఈ రోజు లక్ష్మీ దేవి ప్రతిమను కొనుగోలు చేయడం వల్ల ఏడాది పాటు ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఏడాది అంటే.. ధనత్రయోదశి మంగళవారం అంటే.. అక్టోబర్ 29వ తేదీన జరుపుకుంటున్నారు. అసలు ధనత్రయోదశితోనే దీపావళి పండగ ప్రారంభమవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. సంపదతోపాటు శ్రేయస్సు కలగాలంటే ధనత్రయో దశ రోజు.. లక్ష్మీదేవిని తప్పక పూజించాలని వారు వివరిస్తున్నారు.


చిన్న చెంచా చాలు..

ఇక ధనత్రయోదశి రోజు.. ఒక చిన్న చెంచాను సైతం కొనుగోలు చేయాలని వారు వివరిస్తున్నారు. ఇది చాలా శుభప్రదమైందని వారు పేర్కొంటున్నారు. ఈ రోజు ధనవంతులు సైతం చెంచా కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళ్తారని వారు వివరిస్తున్నారు. అయితే ఈ చెంచా ధనత్రయోదశి రోజు.. ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య కొనుగోలు చేయాలని వారు స్పష్టం చేస్తున్నారు.


ఎందుకంటే ఇది అత్యంత శుభమైన కాలమని వారు విశదీకరిస్తున్నారు. ఇక ఈ చెంచాతో ఆహారం తినకూడదని వారు అంటున్నారు. దీపావళి పర్వదినం రోజు పూజ అనంతరం ఈ చెంచాను భద్రంగా ఉంచాలని.. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఏ మాత్రం లోటు ఉండదని చెబుతున్నారు.


అలాగే ధనత్రయోదశి రోజు.. బంగారం, వెండి పాత్రలతోపాటు నూతన వస్త్రాలు, ఇల్లు, ఆస్తి మొదలైనవి కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. ధన త్రయోదశి రోజు ఇవన్నీ కొనుగోలు చేయడం శుభప్రదం.. అలాగే లక్ష్మీదేవి సైతం ప్రసన్నరాలవుతుందని వివరిస్తున్నారు.


ఇంతకీ ధనత్రయోదశి ఎప్పుడు?

ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా అంతా జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం త్రయోదశి తిథి అక్టోబర్ 29న మంగళవారం ఉదయం 10:33 గంటలకు మొదలవుతుంది. ఇది అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12:35 గంటలకు ముగియనుంది. సాధారణంగా ధనలక్ష్మీ పూజ సాయంత్రం వేళ చేస్తారు. అందుకే త్రయోదశి తిధి సాయంత్రం సమయంలో ఉంది కాబట్టి.. అక్టోబరు 29వ తేదీనే ధన త్రయోదశి జరుపుకోవాలని శాస్త్ర పండితులే కాదు పంచాంగ కర్తలు సైతం స్పష్టం చేస్తున్నారు.


ధనత్రయోదశ పూజ‌కు శుభ ముహూర్తం

హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6:31 గంటల నుంచి రాత్రి 8:13 గంటల వరకు ధనత్రయోదశ పూజకు అత్యంత శుభ సమయమైన కాలమని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 29 , 2024 | 04:05 PM