ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diwali 2024: దీపావళికి ఇల్లు శుభ్రం చేస్తున్నారా.. ఈ 5 వస్తువులను పొరపాటున కూడా పడేయకండి..

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:42 PM

దీపావళి సందర్భంగా ఇల్లు శుభ్రం చేసే సమయంలో కొందరు కొన్ని వస్తువులు పడేస్తుంటారు. అయితే ఈ వస్తువులు పడేస్తే లక్ష్మీదేవి కోపిస్తుంది.

Diwali

జీవితాలలో వెలుగులు నింపే పండుగగా దీపావళిని పేర్కొంటారు. ఈ పండుగకు ముందు భారతీయులు తమ ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటారు. ఇంటిని చక్కగా అలంకరించుకుంటారు. శుభ్రంగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుందని నమ్ముతారు. ఈ కారణంగా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని వస్తువులను ఇంటి నుండి తొలగిస్తుంటారు. ఇలా తొలగించే కొన్ని వస్తువులు లక్ష్మిదేవి రాకకు ఆటంకం కలిగిస్తాయట. ఇంతకీ ఇంట్లో తొలగించకూడని వస్తువులు ఏంటో తెలుసుకుంటే..

తేనె గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు ఇవీ..


నెమలి ఈకలు..

చాలామంది ఇళ్లలో నెమలి ఈకలు ఉంటాయి. ఇవి ఇంటికి ఆకర్షణ కోసం, అలంకరణ కోసమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తి కోసం కూడా ఉంచుతారు. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొందరు ఇంటి నుండి నెమలి ఈకలను తొలగిస్తారు. కొందరు గుడులలో పెట్టేస్తారు. కానీ ఇంట్లో నెమలి ఈకలను తీసేస్తే లక్ష్మీదేవి కలత చెందుతుందట. నెమలి ఈకలను పారేయడం, తొలగించడం చేయకుండా వాటిని శుభ్రం చేసి ఇంట్లోనే ఉంచాలి.

చీపురు..

ఇల్లంతా శుభ్రం చేసి చీపురును పడేయడం చాలామంది చేసే పని. కొత్త చీపురు కూడా కొంటారు. కానీ పాత చీపురును పడేయకూడదు. చీపురు లక్ష్మీదేవితో సమానం అంటారు. పాత చీపురును బయట పడేయడం అంటే లక్ష్మీదేవిని బయటకు పంపడమే. ఒక వేళ పాత చీపురు అవసరం లేదనుకుంటే ఇంట్లోనే ఒక మూలన పెట్టాలి. పండుగ సమయంలో మాత్రం పడేయకూడదు.

పాత నాణేలు..

ఇంట్లో పాత నాణేలు, చెల్లని నాణేలు ఏమైనా ఉంటే వాటిని పడేయడం కొందరు చేస్తారు. కానీ వీటిని బయట పడేస్తే లక్ష్మీదేవి కోపిస్తుంది. వీటిని శుభ్రపరిచి లక్ష్మీదేవి పూజలో ఉంచాలి.

టీని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఆయుర్వేదం చెప్పిన ఈ నిజాలు తెలిస్తే..


పుస్తకాలు..

సాధారణ పుస్తకాలు కాదు కానీ మత పరమైన పుస్తకాలు ఉంటాయి. వీటిలో భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి మత పరమైన పుస్తకాలు ఏమాత్రం చిరిగిపోయి ఉన్నా వాటిని పడేయడం లేదా దేవుడి గుడిలో పెట్టడం చేస్తుంటారు కొందరు. కానీ ఇలా చేయకూడదు. ఒక వేళ పుస్తకాలు అవసరం లేదని అనిపిస్తే ఆ పుస్తకాలను దీపావళి తరువాత పుస్తకాలంటే ఇష్టమున్న ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు.

ఎరుపు వస్త్రం..

హిందూ మతంలో ఎరుపు రంగును చాలా ప్రాధాన్యత ఉంది. ఎరుపు రంగును చాలా పవిత్రమైనదిగా చూస్తారు. ఎరుపు రంగు దుస్తులను పడేయకుండా ఉతికి శుభ్రం చేసుకోవాలి. వీటిని లక్ష్మీదేవి పూజ సమయంలో పూజ దగ్గర ఉంచాలి.

ఇవి కూడా చదవండి..

ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందంటే..

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 28 , 2024 | 01:11 PM