EC: భద్రాచల రామయ్య కళ్యాణ వేడుక లైవ్ టెలికాస్ట్‌కు ఈసీ నో..?
ABN, Publish Date - Apr 16 , 2024 | 07:56 PM
శ్రీరామ నవమి పర్వదినం రోజున భద్రాచలంలో కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వైకుంఠం నుంచి కొలువుదీరిన చతుర్భుజ రామునిగా భద్రాద్రి రామునికి పేరు ఉంది. వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
హైదరాబాద్: శ్రీరామ నవమి (Sri Rama Navami) పర్వదినం రోజున భద్రాచలంలో కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వైకుంఠం నుంచి కొలువుదీరిన చతుర్భుజ రామునిగా భద్రాద్రి రామునికి పేరు ఉంది. వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఏటా లైవ్ టెలికాస్ట్ చేయడంతో కోట్లాది మంది ప్రజలు ఆ సీతారాముడిని చూసి తరిస్తారు. ఇంటి వద్ద నుంచే ఆది దంపతులను చూసి మైమరచిపోతారు.
TG Politics: శ్రీరామ కళ్యాణ మహోత్సవంపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
అడ్డొచ్చిన కోడ్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల అధికారులు తోసిపుచ్చారు. కోడ్ అమల్లో ఉండగా లైవ్ టెలికాస్ట్ కుదరదని తేల్చిచెప్పారు. భక్తుల కోసం ఈసీని రేవంత్ సర్కార్ మరోసారి విన్నవించింది. తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని 6వ తేదీన మరో లేఖ రాసింది. ఆ లేఖపై ఈసీ మంగళవారం వరకు స్పందించలేదు.
ఎప్పటి నుంచి అంటే..?
భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం గత కొన్నేళ్ల నుంచి చేస్తున్నారు. 1987లో తొలిసారి లైవ్ టెలికాస్ట్ చేశారు. అప్పటి నుంచే కొందరు భక్తులు టీవీల్లో సీతారాములను చూసి తరించేవారు. 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ లైవ్ ఇచ్చింది. రేడియో ద్వారా కళ్యాణ మహోత్సవానికి సంబంధించి మాట్లాడారని ఈసీకి రాసిన లేఖలో రేవంత్ ప్రభుత్వం గుర్తుచేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఆ లేఖపై మంగళవారం వరకు ఎన్నికల కమిషన్ స్పందించలేదు. రేపే (బుధవారం) శ్రీరామ నవమి కావండో.. ఆ లోపు ప్రకటన వచ్చే అవకాశం లేదు. దాంతో ఈ సారి భద్రాద్రి రాముడి కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చూసే అవకాశాన్ని రామయ్య భక్తులు కోల్పోయారు.
Andhra Pradesh: ధనస్సు ఆకారంలో అద్భుత రామాలయం.. మీరెప్పుడైనా ఈ గుడికి వెళ్లారా.. ఎక్కడంటే
మరిన్ని ఆధ్మాత్మిక వార్తల కోసం
Updated Date - Apr 16 , 2024 | 07:56 PM