అనుగ్రహం.. 22 - 28 డిసెంబర్ 2024
ABN, Publish Date - Dec 22 , 2024 | 11:36 AM
ఆటుపోట్లను అధిగమిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయంలోనూ రాజీపడొద్దు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. రావలసిన ధనం అందు తుంది.
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
ఆటుపోట్లను అధిగమిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయంలోనూ రాజీపడొద్దు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. రావలసిన ధనం అందు తుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమిం చాలి. ఆశావహదృక్పఽథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితోనూ మితంగా సంభాషించండి. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
దృఢసంకలంతో అడుగు ముందుకేయండి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. స్వయం కృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆదాయం నిరా శాజనకం. సన్నిహితులతో సంభాషణ ఉప శమనం కలిగిస్తుంది. పనులు వేగవంతమవు తాయి. గురువారం నాడు కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అనవసర జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూల సమయం. వ్యతిరేకులతో జాగ్రత్త. అందరినీ కలుపుకుపోయేందుకు యత్నిం చండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగు తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. దుబారా ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. బుధవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. చెల్లింపుల్లో జాగ్రత్త వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్థ వహించాలి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
సర్వత్రా ప్రోత్సాహకరం. ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. నిర్దిష్టప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమి స్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రియమైన వార్త విన వలసి వస్తుంది. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
ఈ వారం ఆశాజనకం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలు కొలిక్కివస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్క రించుకుంటారు. రావలసిన ధనం అందు తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఇంటి విషయాలపైౖ దృష్టి పెడతారు. పనులు వేగ వంతమవుతాయి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. వేడుకకు హాజరవుతారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యలు తొలగి తాకట్టు విడిపించు కుంటారు. ప్రణాళికలు వేసుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అతిగా శ్రమించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆశలొది లేసుకున్న ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు త్వరితగతిన సాగుతాయి. శనివారం నాడు పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. గృహమరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ప్రణాళికాబద్థంగా శ్రమిం చండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగి స్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టు కోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటి వారి తీరును గమనించి మెలగండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. గురువారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమిం చాలి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. పరిస్థితులు నిదా నంగా చక్కబడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. భేషజాలకు పోవద్దు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగి స్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆప్తులను కలుసుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతికూలతను అనుకూలంగా మలుచుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగు లోకి వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సోమ, మంగళవారాల్లో ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి.
Updated Date - Dec 22 , 2024 | 11:36 AM