Holi 2024: హోలీకి ముందు మీఇంట్లో ఉన్న ఈ వస్తువులు తీసిపడేయండి.. సమస్యలన్నీ పోతాయ్..!
ABN, Publish Date - Mar 19 , 2024 | 01:08 PM
Holi 2024: హోలీ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహాంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి 25వ తేదీన హోలీ(Holi Festival) పండుగ వస్తోంది. హోలీ వేళ కొన్ని వాస్తు(Vastu Tips) పరమైన పరిహారాలు పాటిస్తే.. ఉపయోగకరంగా ఉంటుందని వాస్తు పండితులు(Vastu Experts) చెబుతున్నారు.
Holi 2024: హోలీ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహాంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి 25వ తేదీన హోలీ(Holi Festival) పండుగ వస్తోంది. హోలీ వేళ కొన్ని వాస్తు(Vastu Tips) పరమైన పరిహారాలు పాటిస్తే.. ఉపయోగకరంగా ఉంటుందని వాస్తు పండితులు(Vastu Experts) చెబుతున్నారు. మరి ఆ పరిహారాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటిని శుభ్రంగా ఉంచాలి: ఇంటిని చిందరవందరగా ఉంచకూడదు. సానుకూల శక్తి ప్రవహించేలా ఇంట్లోని స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన ఆర్థిక పరమైన అడ్డంకులు తొలగిపోయి.. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. తద్వారా సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి.
పాత వాటిని పడేసి.. కొత్తవాటిని తెచ్చుకోవాలి: పాత, ఉపయోగించని వస్తువులు, ముఖ్యంగా పాదరక్షలను ఇంట్లో ఉంచుకోవడం వాస్తు ప్రకారం ఆర్థిక శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది. హోళీకి ముందు విరిగిన, ఉపయోగించని పాదరక్షలు, వస్తువులను పడేయండి.
తులసి మొక్కను నాటండి: పవిత్రమైన తులసి మొక్క ఇంట్లోకి శాంతి, శ్రేయస్సును తీసుకువస్తుందని విశ్వాసం. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం హోలీ పండుగకు ముందు తులసి మొక్కను ఏర్పాటు చేయాలి.
పాత దుస్తులు దానం: మీవద్ద ఏవైనా పాత దుస్తులు ఉన్నట్లయితే.. అవసరమైన వారికి దానం చేయడం ఉత్తమం. వాస్తు ప్రకారం ఇది మీకు మేలు చేస్తుంది.
దాచిన రంగులను ఉపయోగించొద్దు: కొంతమంది గత ఏడాది కానీ, అంతకు ముందు గానీ దాచిన రంగులను హోలీ పండుగ వేళ ఉపయోగిస్తారు. కానీ, అలా చేయొద్దని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇది చర్మానికి హానీ తలపెట్టడమే కాకుండా.. స్తబ్దత శక్తిని కలిగిస్తుంది. సురక్షితమైన, ఉత్సాహభరితమైన సెలబ్రేషన్స్ కోసం తాజా రంగులను వినియోగించడం ఉత్తమం.
విరిగిన వస్తువులను పడేయండి: విరిగిన గాజులు, చిత్రాలు, విగ్రహాలు వాస్తు ప్రకారం అశుభమైనవిగా పేర్కొంటారు. హోలీకి ముందు వీటిని పడేయం ఉత్తమం. విరిగిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పడేయడం ఉత్తమం.
ఈ సింపుల్ వాస్తు చిట్కాలను అనుసరించడం ద్వారా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి.. పాజిటివ్ వైబ్స్ వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తద్వారా మీ లైఫ్ హ్యాపీగా ముందుకు సాగుతుందని చెబుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని, వాస్తు నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 19 , 2024 | 01:08 PM