karthika Masam 2024: కార్తీక మాసంలో పాటించ వలసిన నియమాలు.. పఠించ వలసిన స్తోత్రాలు
ABN, Publish Date - Nov 06 , 2024 | 04:39 PM
జీవితమంటేనే సమస్యలమయం. ఈ సమస్యల నుంచి బయట పడడానికి భగవంతుడుని ధ్యానించడం ఒక్కటే మార్గం. కార్తీక మాసంలో ఆ భగవంతుడిని ధ్యానించడం ద్వారా పలు సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు. అందుకు ఈ మాసం సర్వ శ్రేష్ఠం.
ఏడాదిలో శుభ మాసాలు చాలానే ఉన్నాయి. వాటిలో కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధకులకు అత్యంత విశిష్టమైనదని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. ఈ మాసంలో చన్నీటి స్నానం, దానం, జపాలకు అత్యంత విశేష ఫలితం ఉంటుందని వారు వివరిస్తున్నారు. అదీకాక కార్తీక మాసం.. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అలాంటి ఈ మాసంలో భక్తులు ఈ నియమాలు తప్పక పాటించి.. ఈ శ్లోకాలు పఠిస్తే మాత్రం విశేష ఫలితాలు లాభిస్తాయని వారు చెబుతున్నారు.
Also Read: డొనాల్డ్ ట్రంప్‌కు వెల్లువెత్తిన అభినందనలు
Also Read: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు
ఈ మాసంలో ఆదివారం..
ఇక మరి ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం రోజు చేసే పూజలకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. ఈ మాసమంతా ఆదివారం మాంసాహారం తినకుండా కులదేవతను పూజించాలని చెబుతున్నారు. అలాగే ఆదివారం సూర్య నమస్కారాలు చేస్తూ.. ఆదిత్య హృదయం పారాయణ చేయాలని.. ఆ క్రమంలో ఒంటిపూట భోజనం చేయాలని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.
Also Read: Nagula Chavithi : ఇంతకీ నాగుల చవితి ఏ రోజు వచ్చింది.. స్వామి వారిని ఎలా ఆరాధించాలి?
తరతరాల దోషాలు తొలగాలంటే..
కొంత మందికి కుటుంబంలో తరతరాలుగా దోషాలు సంక్రమిస్తాయని... అలాగే జాతక రీత్యా కూడా దోషం ఉంటుందని.. అలాంటి వారు ఈ కార్తీక మాసంలో అందుకు సంబంధించిన స్తోత్రాలను భక్తి శ్రద్దలతో పఠించడం ద్వారా విశేషమైన ఫలితముంటుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు.
Also Read: నరకాసురుడు ఎవరు ? దీపావళి రోజు అతని దిష్టిబొమ్మను ఎందుకు దహనం చేస్తారంటే..?
త్వరగా వివాహం కావాలంటే.. అలాగే ఇతరత్రా సమస్యలు..
కుజ దోష సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు ఈ కార్తీకమంతా సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి.
నాటక రంగం వారు, వైద్య వృత్తిలోని వారు ప్రత్యంగిరి, నరసింహ స్తోత్రాలు ఈ మాసం మొత్తం పారాయణ చేయాలి.
విద్యార్థులు చదువులో విజయం సాధించడం కోసం సరస్వతి, హాయగ్రీవ, వినాయక స్తోత్రాలు చదవాలి.
విజయాలు సాధించేందుకు, భయాందోళనలు దూరమయ్యేందుకు, కార్యసిద్ధి సాధించేందుకు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారు.. బైద్యనాద్ స్త్రోత్రంతోపాటు ఆదిత్య హృదయాన్ని సైతం పఠించాలి.
వ్యాపారంలో నష్టాలు, కుటుంబ కలహాలు, అప్పులు, కోర్టు కేసులు, అపనిందలు, రాహు గ్రహ దోషాలతో సతమతమవుతున్న వారు మంగళ చండికా స్తోత్రం పారాయణం చేయాలి.
చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు, షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ కార్తీక మాసమంతా మానసా దేవి స్తోత్రం చదువుకోవాలి.
ఎంత కష్టపడినా.. జీవితంలో ఎదుగుదల గుర్తింపు లేని వారు గరుడ ప్రయోగ మంత్రం పఠించాలి. నేత్ర సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొనే వారు సైతం ఈ మంత్రం చదివితే ఫలితం ఉంటుంది.
శత్రు బాధలతోపాటు జీవితంలో విజయం కోరుకునే వారు దుర్గా స్తోత్రం పారాయణం చేయ్యాలి.
ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగాలని ఆకాంక్షించే వారు లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం పఠించ వలసి ఉంటుంది.
నూతన గృహం కొనుగోలు చేయాలనుకునే వారు మణిద్వీప వర్ణన పారాయణం చేయాలి.
భూమి విక్రయించాలనుకనే వాళ్లు గణేశ్ ప్రార్థన, భూమి కొనుగోలు చేయాలను కునే వారు లక్ష్మీ వరాహ స్వామి వారి శ్లోకాలు క్రమం తప్పకుండా పారాయణ చేయాలి.
నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే.. ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనుకునే వారు కనకధార స్తోత్రం పఠించాల్సి ఉంటుంది.
ఉదయం.. సాయంత్రం.. ఇలా చేయండి చాలు..
ఈ కార్తీక మాసంలో ఇంటి గుమ్మాల వద్ద అవు నెయ్యితో దీపాలు పెట్టాలి. అలాగే తులసి కోట ముందు సైతం దీపం పెట్టాలి. సూర్యోదయానికి ముందు.. అవు నెయ్యితో పెట్టే దీపాలు విష్ణుమూర్తికి.. సాయంత్రం సంధ్య సమయంలో పెట్టే దీపాలు పరమ శివుడికి చెందుతాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.
For Devotional News And Telugu News
Updated Date - Nov 06 , 2024 | 04:54 PM