ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Krishna Janmashtami: గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

ABN, Publish Date - Aug 24 , 2024 | 07:38 PM

Krishna Janmashtami 2024: హిందూమత గ్రంధాల ప్రకారం శ్రావణ కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ప్రత్యేకం కానుంది. ఈ ఏడాది జన్మాష్టమి నాల్గవ శ్రావణ సోమవారం కావడంతో చాలా అరుదైన యోగం కలిసొచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..

Gajakesari Raja Yoga

Krishna Janmashtami 2024: హిందూమత గ్రంధాల ప్రకారం శ్రావణ కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ప్రత్యేకం కానుంది. ఈ ఏడాది జన్మాష్టమి నాల్గవ శ్రావణ సోమవారం కావడంతో చాలా అరుదైన యోగం కలిసొచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 5,251 సంవత్సరాల తర్వాత ఈ రోజున సూర్యుడు రోహిణి నక్షత్రంతో సింహరాశిలో, చంద్రుడు వృషభ రాశిలోకి వస్తున్నారు. ఫలితంగా జయంతి యోగం ఏర్పడనుంది. ధర్మ శాస్త్రం ప్రకారం.. జయంతి యోగంలో ఉపవాసం ఉండటం వలన శాశ్వతమైన పుణ్యాన్ని కలిగిస్తుందని విశ్వాసం. అంతేకాదు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున గురు, చంద్రుడు వృషభరాశిలోకి స్థానభ్రంశం చెందడం వలన గజకేసరి రాజయోగంతో పాటు శుక్రాదిత్య, ఆరవ రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. జన్మాష్టమి గజకేసరి రాజయోగం ఈ రాశుల వారికి శ్రీకృష్ణభగవానుని ఆశీస్సులతో పాటు.. ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏంటో ఓసారి చూద్దాం..


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గజకేసరి యోగం చాలా శుభప్రదమైనది. గజ, కేసరి అనే రెండు పదాలతో ఏర్పడింది. గజ అంటే ఏనుగు, కేసరి అంటే సింహం అని భావిస్తారు. ఈ రెండూ అత్యంత బలమైన జంతువులు. హిందూ మత గ్రంథాల ప్రకారం వినాయకుడిని గజరాజుగా భావిస్తారు. తెలివి తేటలకు, బలానికి, సంపదలకు ప్రతీకగా పేర్కొంటారు. ఇక సింహం భయమెరుగని జంతువు. దూర దృష్టి, నైపుణ్యం, నాయకత్వ సామర్థ్యం కలిగిన జీవి. ఈ ప్రకారం.. ఎవరి జాతకంలో గజకేసరి యోగం ఏర్పడుతుందో.. వారు అఖండ విజయాలను, సిరిసంపదలను అందుకుంటారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ గజ కేసరి యోగం ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఏర్పడుతుంది.


మేష రాశి..

మేష రాశిలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశి వారికి అంతా శుభమే జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడంతో పాటు.. సంపద కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్ధతును పొందుతారు. కుటుంబ సభ్యులు, మీ గురువుల సహాయంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాహం అయిన వారు మీ భాగస్వామితో అందమైన సమయాన్ని గడుపుతారు. కెరీర్‌లో కూడా విజయం సాధిస్తారు.


సింహ రాశి..

ఈ రాశి వారికి శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ప్రత్యేకమైనది. బృహస్పతి, శుక్రుడు, ఇతర గ్రహాల శుభ ప్రభావం ఈ రాశి వారిపై ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ మేధో నైపుణ్యంతో అనేక రంగాల్లో విజయాలు సాధిస్తారు. విద్యా రంగంలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగార్థులకు మరో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. కార్యాలయంలోని సీనియర్ అధికారులు, సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతారు. కార్యాలయంలో చాలా రోజులుగా ఉన్న సమస్యకు ఇప్పుడు పరిష్కారం లభించనుంది. మాటలో మాధుర్యం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.


కన్య రాశి..

ఈ రాశి వారికి గజకేసరి యోగం చాలా మేలు చేస్తుంది. ఆధ్యాత్మికం వైపు దృష్టి పెడతారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి దైవ క్షేత్రాలకు వెళతారు. మతపరమైన విషయాలలో మీ ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ఇల్లు, వాహనం లేదా ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. చేపట్టే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. అయితే, కొన్ని సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చినప్పటికీ.. వాటిని సులభంగా అధిగమిస్తారు.


Also Read:

ఆగం ఆగం కేసులు వినొద్దు!

ఉత్తర భారత దేశానికి బంగారు వీరుడు

హైడ్రా పేరుతో హైడ్రామా.. కిషన్ రెడ్డి విమర్శలు

For More Spiritual News and Telugu News..

Updated Date - Aug 24 , 2024 | 07:38 PM

Advertising
Advertising
<