Today Horoscope : ఈ రాశి వారు బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు | Today Horoscope of Thursday 31 October 2024
Share News

Today Horoscope : ఈ రాశి వారు బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:01 AM

నేడు (31-10-2024 - గురువారం) వేడుకల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి గురించి ఆలోచిస్తారు...

Today Horoscope : ఈ రాశి వారు బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు

నేడు (31-10-2024 - గురువారం) వేడుకల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి గురించి ఆలోచిస్తారు.

01 Mesham - Aries.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి గురించి ఆలోచిస్తారు. పెట్టుబడులకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ఇది తగిన సమయం కాదు. ఆర్థిక విషయాల్లో బందుమిత్రుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. అమ్మవారి ఆలయ దర్శనం శుభప్రదం.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

02 Vrushabham - Taurus.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కొత్త పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కంపెనీలు, వ్యవసాయం, హోటల్‌ రంగాల వారు భాగస్వామి నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఖ్చులు అంచనాలు మించుతాయి. శ్రీ సాయిబాబా ఆరాధన శుభప్రదం.


03 Mithunam - Gemini.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతమలతో ఆనందంగా గడుపుతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వేడుకల కోసం ఖర్చులు అధికం మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. లక్ష్మీదేవిని ఆరాధించండి.


04 Karkatakam - Cancer.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఆనందం కలిగిస్తాయి. దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మవారి ఆరాధన శుభప్రదం.


05 Simha - Leo.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువులు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇల్లు, స్థలసేకరణకు సంబంధించిన చర్చలకు అనుకూల సమయం. ప్రయాణాల్లో నిదానం పాటించాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి అడుగువేయాలి. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


06 Kanya - Virgo.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనాల కొనుగోలుకు అనుకూలం. పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. ఆర్థిక పరమైన చర్చలు ఫలిస్తాయి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. దుర్గామాత ఆరాధన శుభప్దరం.


07 Tula - libra.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బందుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ధనార్జనకు సంబంధించిన కొత్త ఆలోచనలు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.


08 Vruschikam - Scorpio.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. దూరంలో ఉన్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ, సినీ, న్యాయ రంగాల వారు ఆచితూచి ముందడుగు వేయాలి. లక్ష్య సాధనకు అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి.


09 Dhanassu - Sagittarius.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

బందుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థికపరమైన చర్చలకు అనుకూలం. బృంద కార్యక్రమాలు కోసం ఖర్చులు అధికం. విరాళాలు, దానధర్మాలకు వెచ్చిస్తారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.


10 Makaram - Capricorn.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, విందుల్లో పెద్దలను కలుసుకుంటారు. ఉద్యోగులకు ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బోనస్‌లు, ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. పదిమందిలో మీ గౌరవానికి భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. కనకధారా స్తోత్ర పారాయణం శుభప్రదం.


11 Kumbham - Aquarius.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

బందుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు. ప్రయాణాలు, చర్చలు మంచి ఫలితాలనిస్తాయి. ఉన్నత చదువుల విషయంలో పెద్దల సహకారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్యీదేవి ఆరాధన శుభప్రదం.


12 Meenam - Pisces FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది. పెద్దలను స్మరించుకుంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. దుర్గాష్టక పారాయణ శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 31 , 2024 | 01:01 AM