Share News

Today Horoscope: ఈ రాశి వారికి అకస్మాత్ ధనప్రాప్తి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:10 AM

నేడు 16-04-2025, బుధవారం, ఇంటికి అవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Today Horoscope: ఈ రాశి వారికి అకస్మాత్ ధనప్రాప్తి

నేడు 16-04-2025, బుధవారం, ఇంటికి అవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాదిస్తారు. దూరప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. ఉన్నత విద్యా విషయాలపై దృష్టి పెడతారు. ప్రచురణలు, కళలు, రచనల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. దీర్ఘకాలక పెట్టుబడులపై దృష్టి సారించడం మంచిది. మూచ్యవల్‌ ఫండ్స్‌, బీమా వ్యవహారాలు లాభిస్తాయి.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సమావే శాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూలమైన సమయం. వేడుకలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి.


MESHAM-04.jpg

కర్కాటకం ( జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. విందు వినోదాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. సహోద్యోగులతో ఆనందంగా గడుపుతారు. ఉన్నత పదవులకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి.


MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఏర్పాట్లు ఫలిస్తాయి.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఇంటికి అవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తికి సంంబధించిన నిర్ణయాలకు అనుకూలం. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల నుంచి ఆనందకరమైన సమాచారం అందుకుంటారు. మార్కెటింగ్‌, రవాణా, బోధన రంగాల వారికి జనసంబంధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌ వ్యాపారులకు అనుకూలం. విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

టెక్స్‌టైల్స్‌, ఎగుమతులు, సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్జికంగా పోత్ర్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న ప్రియతముల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. విదేశాలు, దూరప్రాంతాల్లో చదుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాలకు సంబంధించిన సమావేశాలు లాభిస్తాయి. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. స్థిరాస్తి సేకరణకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పెద్దలతో చర్చలు ఫలిస్తాయి. ఉన్నత వదవుల కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. లక్ష్య సాధనలో తోబుట్టువుల సహకారం లభిస్తుంది. చర్చలు, ఒప్పందాలకు అనుకూలమైన రోజు. సంకల్పం నెరవేరుతుంది.


MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉన్నత విద్యకు అవసరమైన నిధులు ఏర్పాటవుతాయి.

Updated Date - Apr 16 , 2025 | 12:10 AM