ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pitru Pakshalu 2024: పితృపక్ష దోష నివారణకు ఇదే సమయం.. పురుషులు అసలు చేయకూడని పనులు

ABN, Publish Date - Sep 20 , 2024 | 01:50 PM

పితృదోష పరిహారం కావాలని భావించే వారు మంగళవారం ఉదయాన్నే హనుమాన్ ఆలయాన్ని సందర్శించి.. హనుమంతునికి నైవైద్యం సమర్పిస్తే పితృదోషాలు తొలిగిపోతాయని అంటున్నారు. మంగళవారం వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు అన్నదానం చేసినా పితృ దోషాలు తొలుగుతాయని చెబుతున్నారు.

మన పూర్వీకులకు అంకితం చేయబడిన కాలాన్ని పితృపక్షం అంటారు. ఇవి సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభమయినాయి. వచ్చే అమావాస్య వరకు అంటే.. అక్టోబర్ 2వ తేదీతో ఈ పితృపక్షాలు ముగియనున్నాయి. ఈ కాలంలో మనం ఏం చేస్తే మన పూర్వీకులు సంతోషిస్తారు. ఈ సమయంలో ఏం చేయకూడదు. ఈ పక్షం రోజుల్లో ఏం కొనుగోలు చేయాలి. ఏం కొనుగోలు చేయకూడదు తదితర విషయాలను శాస్త్ర పండితులు సోదాహరణగా వివరిస్తున్నారు.


పితృపక్ష కాలంలో చేయాల్సిన పనులు..

ఈ పక్షం రోజుల్లో పూర్వీకులు తమ వారిని కలుసుకోవడం కోసం భూమి మీదకు వస్తారని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో మనం చేసే నదీ స్నానాలు, దానాలు, తర్పణాలు, శ్రార్థ కర్మలు, పిండ ప్రదానాలు.. వారిని ఆత్మ సంతృప్తి కలిగించే విధంగా ఉండాలని వారు పేర్కొంటున్నారు. తద్వారా మన పూర్వీకుల ఆశీర్వాదం మనపై కచ్చితంగా ఉంటుందని వారు విశదీకరిస్తున్నారు.


ఇలా చేస్తే.. పితృదోషం నుంచి విముక్తి..

పితృదోష పరిహారం కావాలని భావించే వారు మంగళవారం ఉదయాన్నే హనుమాన్ ఆలయాన్ని సందర్శించి.. హనుమంతునికి నైవైద్యం సమర్పిస్తే పితృదోషాలు తొలిగిపోతాయని అంటున్నారు. మంగళవారం వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు అన్నదానం చేసినా పితృ దోషాలు తొలుగుతాయని చెబుతున్నారు. అలాగే సోమవారం ఉపవాసం ఉండి.. పేదలకు ఆహారాన్ని పంచి పెట్టినా పితృదోష నివారణ అవుతుందని పేర్కొంటున్నారు.

అదే విధంగా పితృపక్షంలో అంటే.. ఈ 15 రోజుల్లో పెద్దలను గౌరవించాలని వారు సూచిస్తున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో అగౌరవ పరచవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటికి వచ్చిన అతిథులను, యాచకులను సైతం అగౌరవ పరచకుండా వారికి ఆహారాన్ని ఇస్తే ఆ కుటుంబంలోని పెద్దలు సంతోషిస్తారని వివరిస్తున్నారు. అదే విధంగా జంతువులు, పక్షులకు ఆహారంతోపాటు నీటిని ఇస్తే పితృ దోషం తొలిగి పోతుందని అంటున్నారు.


పితృపక్షాల్లో ఇవి కొనుగోలు చేయకూడదు..

ఈ సమయంలో పొరపాటున కూడా ఉప్పు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. ఉప్పు కొనుగోలు చేస్తే తప్పకుండా పితృ దోషం కలుగుతుందంటున్నారు. ఇది ఆర్థిక సమస్యలను తెచ్చి పెడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పు మాత్రం కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు. అలాగే ఆవాలు, ఆవ నూనె సైతం కొనుగోలు చేయడం మంచిది కాదని వివరిస్తున్నారు.

ఓ వేళ ఎవరైనా పొరపాటున ఆవ నూనె కొనుగోలు చేస్తే.. మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారంటున్నారు. ఇక బంగారం, కొత్త వస్త్రాలను సైతం కొనుగోలు చేయవద్దని చెబుతున్నారు. ఓ వేళ.. అలా చేస్తే పితృదేవతల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా చీపురును సైతం కొనుగోలు చేయవద్దని చెబుతున్నారు.


పితృపక్షాల్లో పురుషులు మాత్రం ఇవి అసలు చేయవద్దు..

ఈ 15 రోజులపాటు పురుషులు తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలంటున్నారు. మద్యం, మాంసం వంటి వాటి జోలికి అస్సలు వెళ్లకూడదని శాస్త్రపండితులు పేర్కొంటున్నారు. అలాగే పురుషులు జుట్టు కత్తిరించుకోకూడదని చెబుతున్నారు. గడ్డం సైతం చేసుకోరాదని స్పష్టం చేస్తున్నారు.

ఓ వేళ.. అలా చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో పురుషులు మట్టి కుండ, రాగి, ఇత్దడి పాత్రల్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటివి సైతం పురుషులు చేయరాదంటున్నారు. తినే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి సైతం లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పక్షం రోజుల్లో శుభ కార్యాలు సైతం చేయకూడదని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.

For More Devotional News and Telugu New

Updated Date - Sep 20 , 2024 | 04:11 PM