ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vinayaka Chavithi: పండగ వెనుక సైన్స్ ఉందా?

ABN, Publish Date - Sep 06 , 2024 | 08:47 PM

హిందూ సంప్రదాయంలోని అన్ని పండగలకు దాదాపుగా ప్రకృతితో ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉంటుందన్నది సుస్పష్టం. శనివారం అంటే.. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

హిందూ సంప్రదాయంలోని అన్ని పండగలకు దాదాపుగా ప్రకృతితో ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉంటుందన్నది సుస్పష్టం. శనివారం అంటే.. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. చవితి పర్వదినం సందర్భంగా మట్టి వినాయకుడి ప్రతిమ నుంచి నైవేద్యంగా స్వామి వారికి సమర్పించే ఆహార ప‌దార్థాలు, పూజ‌కు వాడే ప‌త్రి ఆకులతోపాటు చివరకు వినాయకుడి విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం చేసే ప్ర‌తి ఒక్క అంశం వెనుక సైన్స్‌తోపాటు తాత్వికత దాగి ఉందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. అవేమంటే..


మ‌ట్టితో చేసిన వినాయ‌కుడి ప్రతిమ‌ను పూజిస్తే విఘ్నాలు తొలిగి సమస్త విజయాలు సంప్రాప్తిస్తాయని వారు వివరిస్తున్నారు. శతాబ్దాలుగా వినాయ‌క‌ చవితి పర్వదినం పురస్కరించుకుని మండపాల్లో మట్టి విఘ్నేశ్వరుడి విగ్ర‌హాలను ప్రతిష్టించే వారు. ప్రజలు తమ విశ్వాసాల్లో భాగంగా 3, 9 లేదా 12 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేవారు. అనంతరం వినాయకుడి ప్ర‌తిమ‌ను నదుల్లో, చెరువుల్లో నిమ‌జ్జనం చేసే వారు. ఈ సంప్రదాయం నేటికి కొన‌సాగుతుంది. ఇలా చేయడం వ‌ల్ల మ‌ట్టి నుంచి వ‌చ్చిన మ‌నిషి మళ్లీ మ‌ట్టిలోనే క‌లిసిపోతాడ‌నే ఈ మట్టి విగ్రహం పూజించడం వెనుక ఉన్న తాత్విక పరమార్థమని వారు చెబుతున్నారు.


పసుపు విఘ్నేశ్వరుడు ...

ఇక చిన్న పూజ నుంచి యజ్జ యాగాల వరకు ప్రతి పూజలో ముందుగా వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు. అందుకు ఆయన్ని ప‌సుపుతో చేసి పూజలు నిర్వహిస్తారు. ప‌సుపుతో చేసిన గ‌ణ‌ప‌తిని పూజించడానికి గ‌ల కార‌ణం కూడా ఉందని విశదీకరిస్తున్నారు. ప‌సుపును యాంటిబ‌యాటిక్‌గా వినియోగిస్తారని... పురాతన కాలం నుంచి పసుపును ఔష‌ధంగా భారతీయులు వినియోగిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. వైద్యంతోపాటు ఆహారంలో సైతం పసుపును విరివిగా భారతీయులు ఉపయోగిస్తారని పేర్కొంటున్నారు.


21 పత్రాల వెనుక దాగి ఉన్న నిజం..

భద్రపద శుద్ద చవితి రోజు.. వినాయకుడిని 21 పత్రాలతో పూజిస్తారు. ఈ పత్రాలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇక ఈ మాసం భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. ఈ నీటి కారణంగా ప్రజల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఈ నేపథ్యంలో వినాయక ప్రతిమతోపాటు పూజకు వినియోగించిన ఈ పత్రాలను సైతం నిమజ్జనం సమయంలో నీటిలో వదులుతారు. తద్వారా పత్రాల ద్వారా వరద నీరు శుద్ది అవుతుందని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.


ఆవిరి ఆహార పదార్ధాలు..

ఆవిరితో తయారైన ఆహార పదార్ధాలు మానవ శరీరానికి పోషకాలను అందించడమే కాదు.. త్వరత్వరగా జీర్ణమవుతాయి. వినాయక చవితి రోజు.. కుడుములు, ఉండ్రాళ్లు ఆవిరితో తయారు చేస్తారు. వీటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. బియ్యపు పిండి, రవ్వలతోపాటు బెల్లంతో చేసే ఈ ఆహార పదార్ధాలు మనిషి శరీరానికి ఈ వర్షాకాలంలో వెంటనే శక్తిని అందిస్తాయని వారు విపులకరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Vinayaka Chavithi: ఏకవింశతి పూజ అంటే ఏమిటి.. 21 పత్రాల వెనుకనున్న రహస్యం

Vinayaka Chavithi Special 2024: గణపతి పూజ ఎలా చేయాలి.. కావాల్సిన సామాగ్రి..?

Vinayaka Chavithi Special 2024: ముస్లిం దేశాల్లో పూజలందుకొంటున్న ‘గణపతి’

Vinayaka Chavithi Special 2024: ఇంతకీ పండగ శుక్రవారమా? లేక శనివారమా?.. పండితులు ఏం చెబుతున్నారంటే?..

Vinayaka Chavithi Special 2024: పండగ రోజు విద్యార్థులు ఇలా చేస్తే మాత్రం వారికి తిరుగే ఉండదు..

Vinayaka Chavithi Special 2024: ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి. ఏ మంత్రం చదివి పూజించాలంటే..

Updated Date - Sep 06 , 2024 | 08:48 PM

Advertising
Advertising