ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

November 15: నవంబర్ 15 నుంచి ఈ ఐదు రాశుల వారికి జాక్ పాట్. తిరగనున్న దశ.. వీరికి ఎదురే లేదు

ABN, Publish Date - Oct 30 , 2024 | 04:24 PM

ఈ ఏడాది నవంబర్ 15వ తేదీ నుంచి శని తన గతిని మార్చుకుంటున్నాడు. దీంతో ఐదు రాశులకు శుభం జరగనుంది. దాంతో ఆయా రాశులకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు . ఇంతకీ ఆ ఐదు రాశులు ఏమంటే..

జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి.. ప్రతి గ్రహం నిర్దిష్ట వ్యవధి అనంతరం తన కదలికను మార్చుకుంటుంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై ఉంటుంది. శని గ్రహం.. అత్యంత నెమ్మదిగా కదులుతుంది. శని.. ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. జ్యోతిష్య గణాంకాలను అనుసరించి.. దీపావళి అనంతరం నవంబర్ 15వ తేదీ రాత్రి 7:51 గంటలకు శని తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. శని గమనంలో మార్పు కారణంగా ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం పట్టబోతుంది. ఆయా రాశులు ఏమంటే..

Also Read: King Charles 3: భారత్‌లో కింగ్ ఛార్లెస్ దంపతుల పర్యటన.. అంతా టాప్ సీక్రెట్‌


1)

మేష రాశి

ఈ రాశి వారికి కెరీర్ పరంగా మంచి సమయం వచ్చినట్లు అవుతుంది. వ్యాపారం చేసే వ్యక్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇది వారికి భారీ లాభాన్ని చేకూరుస్తుంది. దీంతో సమాజంలో వారికి గౌరవం సైతం లభిస్తుంది. ఇక కుటుంబ సంబంధాలు సైతం బలంగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆశీస్సులతో అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. చాలా కాలంగా ముందుకు కదలని పనులు సైతం ఈ సమయంలో పూర్తవుతాయి.

Also Read: Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు


2)

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టాలని ఆలోచించే వారికి ఇది మంచి సమయం. అయితే భవిష్యత్తులో దీనిపై మంచి రాబడిని అందుకుంటారు. మీ కెరీర్‌లో కొత్త అవకాశాలను కూడా పొందుతారు. ఇక ఉద్యోగ ప్రదేశాల్లో పురోగతికి తలుపులు సైతం తెరుచుకుంటాయి. సహోద్యోగుల నుంచి ఈ రాశి వారికి పూర్తి మద్దతు లభిస్తుంది.

Also Read: ఆలూ చిప్స్‌.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?


3)

కన్యా రాశి

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. చాలా కాలం క్రితం ఏదైనా రుణం తీసుకున్నట్లయితే.. దానిని ఈ సమయంలో తిరిగి చెల్లించవచ్చు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో సైతం విజయం సాధిస్తారు. తీవ్ర మానసిక ఒత్తిడి దూరమై సానుకూలత ఉంటుంది. ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే, అది తొలగిపోతుంది. దీంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Also Read: Choti Diwali 2024: చోటి దీపావళి వేళ.. ఇలా..

Also Read: ICAI: నేడు సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల


4)

మకర రాశి

ఈ రాశి వారి జీవితంలో చాలా కాలంగా తిష్ట వేసుకున్న సమస్యలు.. ఈ సమయంలో తొలగిపోతాయి. నూతన ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు కోరుకున్న అవకాశాలను అంది పుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడుతుంది. వైవాహిక జీవితంలో సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.

Also Read: Reliance: పండగ వేళ.. రిలయన్స్ ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్.. షాక్‌లో నెటిజన్లు


5)

కుంభ రాశి:

ఈ రాశి వారికి శని సంచారం అన్ని శుభాలను కలిగిస్తాడు. వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయం. భవిష్యత్తులో మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. పని ప్రదేశాల్లో మీ ఉద్యోగ పురోగతి బాగుంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 30 , 2024 | 04:24 PM